అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Dhannapal Indiramma houses | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఒక్క లబ్ధిదారుడికి సైతం ఇవ్వలేదని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhan Pal Suryanarayana Gupta) అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూంలపై మాట్లాడారు.
Dhannapal Indiramma houses | నగరంలోని నాగారంలో..
ఇందూరులోని (Induru) నాగారం ప్రాంతంలో 396 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి నాలుగున్నరేళ్లు గడిచిందని ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకువచ్చారు. బీఆర్ఎస్ నాయకులు కమిషన్లు తీసుకున్నారు కానీ ఒక్క ఇల్లు కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. ఏళ్లుగా వృథాగా ఉండడంతో ఇళ్ల తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయని, పలు వస్తువులు చోరీకి గురయ్యాయని తెలిపారు. అనేకసార్లు మంత్రులకు విన్నపించడంతో మరమ్మతుల కోసం రూ.1.25 కోట్లు విడుదల చేశారని, కానీ ఇళ్లు మాత్రం కేటాయించలేదన్నారు. అనవసరంగా ప్రజాధనం వృథా అవుతుందని చెప్పారు. అలాగే కలెక్టరేట్ సమీపంలో 200 డబుల్ బెడ్రూం ఇళ్లు 80 శాతం పూర్తి చేసుకున్నాయని, మరో రూ.2 కోట్లు మంజూరు చేస్తే పూర్తవుతాయన్నారు. అలాగే జిల్లా కేంద్రంలో వివిధ దశల్లో ఉన్న మరి కొన్ని డబుల్ బెడ్ రూం ఇళ్లకు మరో రూ.3 కోట్లు కేటాయిస్తే సుమారుగా వేయి ఇళ్లు పూర్తవుతాయన్నారు.
Dhannapal Indiramma houses | ఇందిరమ్మ ఇళ్ల పథకంలో..
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో (Indiramma Housing Scheme) భాగంగా స్థలంతో పాటు రూ.5లక్షలు ఇస్తామని చెప్పి మొదటి ఏడాది ఒకటి కూడా అందించలేదని ధన్పాల్ అన్నారు. ఇక రెండో సంవత్సరం స్థలం ఉన్నవారికి రూ.5 లక్షల అందిస్తామని చెప్పారు. కానీ.. నిజామాబాద్ అర్బన్‌లో స్థలం ఉన్న పేదవారు చాలా తక్కువ మంది ఉంటారని, వారు స్థలం కొనుగోలు చేయాలంటే ఖర్చుతో కూడుకున్నదని తెలిపారు. కావున ప్రభుత్వ స్థలం చూయించి, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Sudarshan Reddy Polytechnic Initiative | పాలిటెక్నిక్ కళాశాలలను సద్వినియోగం చేసుకోవాలి: ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి

