అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Dharmapuri Sanjay | నగరంలో ధర్మపురి సంజయ్ అభిమానులు తమ నిరాహార దీక్షను విరమించారు. కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ దీక్ష చేస్తున్ సంజయ్ అభిమానులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
Dharmapuri Sanjay | కాంగ్రెస్ పార్టీలో మున్నూరుకాపులు సముచిత స్థానం..
బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress) పార్టీలో అన్ని వర్గాల వారికి సమాన న్యాయం జరుగుతుందన్నారు. నాయకులు పార్టీ కోసం చేసిన కృషిని గుర్తించి అధిష్టానం సరైన సమయంలో పదవులు సమకూర్చుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో మున్నూరుకాపులకు అన్యాయం జరుగుతుందని సంజయ్ అనుచరులు అనుకోవడం సరైంది కాదన్నారు. నిజామాబాద్ నగర కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడిగా మున్నూరు కాపు బిడ్డనైన నాకు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు.
Dharmapuri Sanjay | కార్పొరేషన్ ఎన్నికల్లోనూ..
అదేవిధంగా రాష్ట్రకాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా రాంభూపాల్‌కు అవకాశం ఇచ్చారన్నారు. అలాగే ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో పది కార్పొరేటర్ స్థానాలను మున్నూరు కాపులకు కేటాయించామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రస్థాయిలో పలు మున్సిపాలిటీల్లో ఛైర్మన్లుగా.. వైస్ ఛైర్మన్లుగా, తదితర నామినేట్ పదవులు కేటాయించడంతో పాటు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ (NSUI) లాంటి ఇతర కీలక పదవులను మున్నూరుకాపులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు. ఇంకా రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ సమయాన్ని బట్టి అవకాశాలను అధిష్టానం కల్పిస్తుందన్నారు.
Dharmapuri Sanjay | పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి పనులు వద్దు..
అందరు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కలిసి పనిచేయాలి కానీ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయకూడదని పేర్కొన్నారు. ధర్మపురి శ్రీనివాస్ అనుచరులుగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడే విధంగా నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపించుకునే విధంగా అందరం కలిసి ముందుకు అడుగులు వేయాలని బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు.
దీనిని కూడా చదవండి : Drivers Health Check | డ్రైవర్లు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ
