అక్షరటుడే, వెబ్‌డెస్క్: Dhurandhar 2 Box Office | బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ (Ranveer Singh) నటించిన ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. కేవలం 18 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1645 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఆల్ టైమ్ టాప్ గ్రాస్‌ర్స్ జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది.
Dhurandhar 2 Box Office | ‘పుష్ప 2’ రికార్డు బ్రేక్‌కు సిద్ధం
ప్రస్తుతం టాప్ ఇండియన్ సినిమాల జాబితాలో దంగల్ – ₹2000+ కోట్లు, బాహుబలి 2 – ₹1810+ కోట్లు, పుష్ప 2: ది రూల్ – ₹1650+ కోట్లు ఉండగా, ఆ తర్వాతి స్థానంలో ‘ధురంధర్: ది రివెంజ్’ – ₹1645 కోట్లు ఉంది. కొద్దిపాటి వసూళ్లు సాధిస్తే ‘పుష్ప 2’ను దాటేసి మూడో స్థానంలో నిలవడం ఖాయం అన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఓవర్సీస్ మార్కెట్ (Overseas Market)లో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటివరకు $42.7 మిలియన్ వసూలు చేసి, ఆల్ టైమ్ టాప్ ఓవర్సీస్ గ్రాస్‌ర్స్‌లో నాలుగో స్థానాన్ని సంపాదించింది.
Dhurandhar 2 Box Office | ఓవర్సీస్ మార్కెట్‌లో బాలీవుడ్ ఆధిపత్యం
ఓవర్సీస్‌లో చూస్తే.. పఠాన్ – $49.3M, జవాన్ – $48M, బాహుబలి 2 – $46.98M, ‘ధురంధర్ 2’ – $42.7M,‘ధురంధర్’ – $32.55M చిత్రాలు టాప్ 5లో ఉన్నాయి. ఓవర్సీస్ మార్కెట్‌లో బాలీవుడ్ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా షారుక్ ఖాన్, రణవీర్ సింగ్ వంటి స్టార్‌లు వరుస విజయాలతో గ్లోబల్ మార్కెట్‌లో దుమ్మురేపుతున్నారు. అలాగే ఆమిర్ ఖాన్, ప్రభాస్ కూడా తమ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో మంచి మార్కెట్ సంపాదించారు. ఇప్పుడు అందరి లో ఓ చర్చ నడుస్తుంది. ఈ సినిమా దంగల్ ₹2000 కోట్ల రికార్డును బ్రేక్ చేస్తుందా? అని. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే, ఈ చిత్రం ₹2000 కోట్ల క్లబ్‌లో చేరడం మాత్రమే కాకుండా కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక ముందున్న భారీ ప్రాజెక్టులు కూడా ఈ రికార్డులను టార్గెట్ చేస్తున్నాయి. రణబీర్ కపూర్ – ‘రామాయణ’, యష్ – ‘రామాయణ’, ఎస్.ఎస్. రాజమౌళి-మహేష్ బాబు ‘వారణాసి’ , సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రాలు కూడా భారీ వసూళ్లు రాబట్టడం ఖాయం. ఈ సినిమాలు భవిష్యత్‌లో గ్లోబల్ బాక్సాఫీస్‌ను మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..: Ranu Bombayiki Ranu Song | యూట్యూబ్‌లో సంచలనం.. రానూ బొంబాయికి రానూ’ ఫోక్ సాంగ్‌కు 800 మిలియన్ వ్యూస్!
