Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Dhurandhar 2 Review | ధురంధర్ 2పై ప్రశంసల వర్షం కురిపించిన రాజమౌళి.. యాక్టింగ్ మాస్టర్‌క్లాస్ అని వ్యాఖ్య..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Dhurandhar 2 Review | ధురంధర్ 2పై ప్రశంసల వర్షం కురిపించిన రాజమౌళి.. యాక్టింగ్ మాస్టర్‌క్లాస్ అని వ్యాఖ్య..

సినిమా

Dhurandhar 2 Review | ధురంధర్ 2పై ప్రశంసల వర్షం కురిపించిన రాజమౌళి.. యాక్టింగ్ మాస్టర్‌క్లాస్ అని వ్యాఖ్య..

ధురంధర్​–1 మూవీ బాక్సాఫీస్​ను షేక్​ చేయగా.. ప్రస్తుతం రిలీజ్​ అయిన 'ధురంధర్ 2: ది రివెంజ్' సినిమా రికార్డుల సునామీ సృష్టిస్తోంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 21, 2026 2:18 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
6 రోజులు ago
Share
Dhurandhar 2 Review

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Dhurandhar 2 Review | ధురంధర్​–1 మూవీ బాక్సాఫీస్​ను షేక్​ చేయగా.. ప్రస్తుతం రిలీజ్​ అయిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ సినిమా రికార్డుల సునామీ సృష్టిస్తోంది. అంచనాలకు మించి టాక్​ తెచ్చుకోవడంతో సినిమా ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. చిత్రం ఎంతో మంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్​లో చేరిపోయారు దర్శక ధీరుడు ‘రాజమౌళి’(Rajamouli). ‘ధురంధర్​ 2’ మాస్టర్​ క్లాస్​ అంటూ కితాబు ఇచ్చారు. ఈ మేరకు సోషల్​ మీడియాలో పోస్టు చేశారు

Contents
  • Dhurandhar 2 Review | ఇంకా ఏమన్నారంటే..
    • Dhurandhar 2 Review | డైరెక్టర్ ఆదిత్య ధర్ అదరగొట్టాడు..
      • Dhurandhar 2 Review | రణ్‌వీర్, మాధవన్​ల నటనపై ప్రశంసలు

Dhurandhar 2 Review | ఇంకా ఏమన్నారంటే..

బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘ధురంధర్ 2: ది రివెంజ్’ మూవీకి మరో స్పెషల్ గుర్తింపు దక్కింది. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రశంసల జల్లు కురిపించారు. సోషల్ మీడియా (Social Media)లో సుదీర్ఘమైన రివ్యూ పంచుకున్నారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. సినిమా స్థాయి, రచన, అందులోని భావోద్వేగ లోతును కొనియాడారు. “నేను ధురంధర్-1ను ఎంతో ప్రేమించాను.. కానీ ‘ధురంధర్​ 2 : ది రివెంజ్’ దాని స్థాయి, ఆత్మ రెండింటిలోనూ అసలు సినిమాను మించిపోయింది” అని రాసుకొచ్చారు.

Dhurandhar 2 Review | డైరెక్టర్ ఆదిత్య ధర్ అదరగొట్టాడు..

‘‘చిత్రంలో సాంకేతిక అంశాలు, యాక్టర్ల ఎంపిక, ప్రపంచ స్థాయి రూపకల్పనలో ఎలాంటి లోపం లేదు. నాలుగు గంటల నిడివి గల సినిమాను తీసేందుకు గట్స్ ఉండాలి. డైరెక్టర్ ఆదిత్య ధర్ (Director Aditya Dhar) అదరగొట్టారు. లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆడియన్స్ సీట్లకు అతుక్కుపోయారు’’ అంటూ ఆకాశానికి ఎత్తేశారు.

Dhurandhar 2 Review | రణ్‌వీర్, మాధవన్​ల నటనపై ప్రశంసలు

హీరో రణ్‌వీర్ సింగ్ (Hero Ranveer Singh) నటనను రాజమౌళి ‘స్టాండౌట్’గా అభివర్ణించారు. “ఏమి నటన మిత్రమా! షెడ్‌లో సోదరితో వచ్చే సీన్​.. నటనలో ఇది మాస్టర్‌క్లాస్. సినిమా స్టార్టింగ్​ నుంచి హృదయ విదారక క్లైమాక్స్ వరకు హమ్జా, జస్కిరాత్ పాత్రల్లో మంత్రముగ్ధులను చేశావ్” అంటూ మెచ్చుకున్నారు. ఇక మాధవన్ నటనను కూడా రాజమౌళి కొనియాడారు. ఒక దేశపు నిస్సహాయతను తన పాత్ర ద్వారా అద్భుతంగా పండించారని కితాబు ఇచ్చారు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్​, రాజమౌళి ఇలా సినీ ప్రముఖులంతా ‘ధురంధర్ 2’ చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తుతుండడంతో సినిమాపై మరింత క్రేజ్ పెరుగుతోంది.

ఇది కూడా చదవండి..: Ustaad Bhagat Singh Ticket Prices | ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ టికెట్‌ రేట్లు పెంపు

Vijay Rashmika Reception | ఘనంగా విరోష్​ రిసిప్షన్​ వేడుక.. హాజరైన ప్రముఖులు..
Vijay Rashmika honeymoon | హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న విజ‌య్-ర‌ష్మిక‌.. స్పెష‌ల్ వీడియోతో షాక్ ఇచ్చిన విరోష్ జంట‌
Telangana SSC Exams | పదో తరగతి పరీక్షలు రద్దు చేయ‌బోతున్నారా.. తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ!
Oscars 2026 | వైభవంగా ప్రారంభమైన 98వ ఆస్కార్ వేడుకలు.. కొత్త కేటగిరీతో చరిత్రలో కీలక మార్పు
Bellamkonda Srinivas Engagement | అది నిశ్చితార్థం కాదు.. కావ్యమ్మపై ప్రేమని వ్య‌క్తం చేస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్
TAGGED:Dhurandhar 2 ReviewDirector Aditya DharRajamouliSocial Media
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Anirudh Hyderabad Concert Anirudh Hyderabad Concert | నేడు హైదరాబాద్​లో అనిరుధ్​ మ్యూజిక్​ కాన్సర్ట్.. ట్రాఫిక్​ ఆంక్షలు
Next Article Ramzan celebrations MLAs Ramzan celebrations MLAs | రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?