అక్షరటుడే, వెబ్డెస్క్ : Diesel Export Duty | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్ ఎగుమతి (Diesel Exports) పై సుంకం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న సుంకాన్ని రూ.21.5 నుంచి రూ.55.5కు పెంచింది.
పశ్చిమాసియాలో యుద్ధంతో ఇటీవల దేశంలో గ్యాస్, ఇంధన సరఫరాలో అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశీయంగా కొరత తలెత్తకుండా ఎగుమతులపై సుంకాలు పెంచింది. విమాన ఇంధనం ATFపైనా సుంకం సైతం రూ.29.5 నుంచి రూ.42కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ఎగుమతి సుంకంలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది.
Diesel Export Duty | ఎగుమతులు అరికట్టడానికి..
ప్రస్తుతానికి దేశీయ పెట్రోల్ సరఫరాలు సరిపోతున్నాయని భావిస్తున్నారనడానికి ఇది ఒక సంకేతం. ప్రపంచ ఇంధన ధరలు అస్థిరంగా ఉన్నందున, దేశీయ లభ్యతకు నష్టం కలిగించి శుద్ధి చేసిన ఇంధనాల ఎగుమతిని అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నంలో భాగంగానే ఈ భారీ సవరణ చోటుచేసుకుంది. ఈ ఎగుమతి సుంకం పెంపు ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడం కోసం కాదని, “ధరల వ్యత్యాసాల కారణంగా ఎగుమతిదారులు అనవసర ప్రయోజనాలు పొందకుండా నిరోధించడమే దీని ముఖ్య ఉద్దేశం” అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా ప్రస్తుతం దేశంలో డీజిల్, పెట్రోల్ అవసరం మేర దొరుకుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల కోసం మాత్రం వేచి ఉండాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో బుక్ చేసిన చాలా రోజుల వరకు సిలిండర్లు డెలివరీ కావడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి : Modi Attacks TMC | టీఎంసీలో వణుకు పుడుతోంది..: ప్రధాని మోదీ
