అక్షరటుడే, ఇందూరు: Digital Census India | జనగణన విధులను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. జిల్లా కలెక్టరేట్లో బుధవారం సంబంధిత శాఖల అధికారులు, తహశీల్దార్లకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు.
Digital Census India | 2011లో చివరిసారిగా జనాభా గణన..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2011లో చివరిసారిగా జనాభా గణన జరిగిందని గుర్తు చేశారు. వాస్తవానికి 2021లో ఈ ప్రక్రియలు చేపట్టాల్సి ఉండగా.. కరోనా వల్ల నిర్వహించలేదన్నారు. ప్రస్తుతం సాంకేతికతను వినియోగిస్తూ డిజిటల్ (Digital) విధానంలో జనాభా లెక్కల సేకరణ జరిపేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తొలి దశలో నివాస గృహాలతోపాటు అన్ని రకాల కట్టడాలు కుటుంబ వివరాలను సేకరించడం జరుగుతుందని చెప్పారు. రెండో విడతలు వ్యక్తిగత వివరాలు సేకరించాల్సి ఉంటుందన్నారు. దేశంలోనే తొలిసారిగా డిజిటల్ విధానంలో జనగణన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే గతేడాది నల్గొండ జిల్లా తిప్పర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలాల్లో ప్రయోగాత్మకంగా కుటుంబ, ఇళ్ల వివరాల సేకరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారని గుర్తు చేశారు.

Digital Census India | ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలి..
జనగణనలో ప్రతిఒక్కరూ భాగస్వాములై వాస్తవ వివరాలు వెల్లడించాలని సూచించారు. ఏ ఒక్కరి వివరాలు బయటికి వెల్లడి కావని, నేరుగా సర్వర్లో నిక్షిప్తమయ్యేలా సాంకేతికతను వినియోగిస్తున్నారని తెలిపారు. ఈసారి సెల్ఫ్ డిక్లరేషన్ ఎంతో ముఖ్యమని అధికారులు, ఎన్యూమరేటర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాగా శిక్షణ ఈనెల 13 వరకు మూడు రోజులపాటు కొనసాగుతుంది. కార్యక్రమంలో బోధన్ ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Red Sorghum Farmers | ఎర్రజొన్న రైతులకు అన్యాయం

