అక్షరటుడే, వెబ్డెస్క్ : Digital Health Cards | రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ (Rajiv Aarogyasri Trust) ద్వారా దీనిని అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు 421 ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స పొందవచ్చన్నారు. 1998 వ్యాధులకు ఈ పథకంలో భాగంగా ఉచితంగా వైద్యం అందించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ కార్డు (Digital Health Card) అందిస్తామన్నారు. ఈ పథకం ద్వారా 23.50 లక్షల ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందుతారని ప్రకటించారు.
Digital Health Cards | బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్
రైతులను విద్యుత్ వినియోగదారులుగా కాకుండా ఉత్పత్తిదారులుగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. శక్తిని ఉత్పత్తి చేయడం ఒక దశ.. దాన్ని నిల్వ చేసి సమర్థవంతంగా వినియోగించడం భవిష్యత్తు అన్నారు. దీనికోసం చౌటుప్పల్, మహేశ్వరంలో 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Digital Health Cards | జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణ
హైదరాబాద్ (Hyderabad) అభివృద్ధి కోసం నగర శివారులోని 20 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లను విలీనం చేశామన్నారు. అనంతరం ప్రభుత్వం జీహెచ్‌ఎంసీని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లుగా విభజించిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలన వికేంద్రీకరణ, స్థానిక జవాబుదారీతనం పెంపొందుతుందన్నారు.
ఇది కూడా చదవండి..: Family Life Insurance Scheme | రాష్ట్రంలో కొత్త పథకం.. ప్రతి కుటుంబానికి జీవితబీమా : డిప్యూటీ సీఎం

