Raising Children | పిల్లలను ఎలా పెంచాలో తెలుసా? ఈ నియమాలు తప్పనిసరి..

Sandeep Balla
2 Min Read
Raising Children | పిల్లలను ఎలా పెంచాలో తెలుసా? ఈ నియమాలు తప్పనిసరి..

అక్షరటుడే, హైదరాబాద్ : Raising Children | ఈ ప్రపంచంలో పిల్లలు సంతోషంగా ఎదగడం ప్రతి తల్లిదండ్రుల కల. పిల్లలకు ధ్యానం (Meditation) , యోగా (Yoga)వంటివి నేర్పించాలి. వారు చిన్న వయస్సులో ఉన్నప్పుడు, కేవలం ప్రేమను, సంతోషాన్ని ఇవ్వడం తప్ప మనం ఏం చేయగలం? పిల్లలకు కేవలం బోధించడం మానేసి, వారితో కలిసి ఆడుకోవడం, నవ్వడం, వారి నుండి నేర్చుకోవడం అసలైన పెంపకం.

పిల్లలను పెంచడంలో ముఖ్య సూత్రాలు:

ఉపాధ్యాయులుగా కాకుండా స్నేహితులుగా ఉండటం:

ఎల్లప్పుడూ ‘ఇలా చేయవద్దు, అలా చేయవద్దు’ అని కర్ర పట్టుకుని వారిని మందలించ వద్దు. సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి రాగానే వారితో సంతోషంగా ఉండండి. హోం వర్క్ (Home Work) చేయమని వచ్చిన వెంటనే వారికి ఇబ్బంది పెట్టకూడదు.

సమయం ముఖ్యం:

పిల్లలతో రోజుకు కేవలం 45 నిమిషాల నుండి ఒక గంట వరకు సమయం గడపడం ముఖ్యం.ఈ సమయాన్ని చాలా ఆసక్తికరంగా మార్చాలి, తద్వారా వారు మీతో కూర్చోవడానికి ఆత్రుతగా ఎదురుచూసేలా ఉండాలి.

నీతి కథలు చెప్పడం:

పిల్లలకు విలువలతో కూడిన మంచి ఆసక్తికరమైన నీతి కథలు చెప్పడం ఉత్తమం. పంచతంత్రం వంటి కథలు వారికి నైతిక విలువలను నేర్పుతాయి. ఇది పిల్లలు టెలివిజన్‌ (Television)కు అతుక్కుపోకుండా చేస్తుంది. కథల చివర్లో ఉత్కంఠను పెంచడం ద్వారా పిల్లల్లో ఆసక్తిని పెంచవచ్చు.

టీవీ సమయం:

పిల్లలు ఉదయం లేచినప్పటి నుండి టీవీ ముందు కూర్చోవడం మంచి సంస్కృతి కాదు. పిల్లలకు రోజుకు ఒక గంట కంటే ఎక్కువ టీవీ చూపించవద్దు . పెద్దలకు కూడా గరిష్టంగా రెండు గంటలు చాలు. టీవీ ఎక్కువగా చూడటం వల్ల మెదడు కణాలపై అధిక శ్రమ పడుతుందని , పిల్లలకు అటెన్షన్ డెఫిషియెన్సీ సిండ్రోమ్ (Deficiency Syndrome) వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వీడియో గేమ్‌లకు దూరం:

పిల్లలను హింసాత్మక వీడియో గేమ్‌ (Violent Video Game)లకు దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే, స్క్రీన్‌పై కాల్చడం కేవలం ఒక ఆటగా భావించే పిల్లలు, వర్చువల్ ప్రపంచానికి ,వాస్తవ ప్రపంచానికి మధ్య తేడాను గుర్తించలేక, నిజ జీవితంలో హింసకు పాల్పడే అవకాశం ఉంది.అప్పుడప్పుడు వారు ఎలాంటి వీడియోలు చూస్తున్నారో గమనించాలి.

ఈ విధంగా, ఆట, ప్రేమ, విలువలతో కూడిన కథల ద్వారా పిల్లలను పెంచడం వారి జీవితానికి బలం చేకూరుస్తుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *