అక్షరటుడే, కామారెడ్డి: Doctor Noble Profession | వైద్యుడు కనిపించే దైవమని, రోగి బాధలో ఉన్నప్పుడు అతనికి కనిపించే మొదటి ముఖం వైద్యుడిదేనని ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ అన్నారు. పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో మెడికల్ విద్యార్థుల ఫేర్‌వెల్ కార్యక్రమంలో ఆయన (Shabbir Ali) పాల్గొన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులను ఘనంగా సన్మానించి, వారికి మెమెంటోలు అందజేశారు.
Doctor Noble Profession | వైద్య విద్యార్థుల జీవితంలో..
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. నేడు వైద్య విద్యార్థుల జీవితంలో ఒక కీలక మైలురాయి అని, విద్యార్థులు సాధించిన విజయం వారి కుటుంబ సభ్యులు, గురువులు, కామారెడ్డి జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కేవలం ఉద్యోగం చేయడం కాదని, సమాజానికి సేవ చేసే మహోన్నత వృత్తిలోకి అడుగుపెడుతున్నారన్నారు. వైద్యులు (Doctors) తమ వృత్తిలో సేవకు ప్రాధాన్యం ఇవ్వాలని, పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఒక చిరునవ్వుతో ఇచ్చే సేవ, ఒక మంచి మాటతో ఇచ్చే ధైర్యం అనేక ప్రాణాలను కాపాడతాయన్నారు.
Doctor Noble Profession | కామారెడ్డిలో చదివిన విద్యార్థులు..
కామారెడ్డిలో (Kamareddy) చదివిన విద్యార్థులు ప్రపంచస్థాయికి ఎదిగే సామర్థ్యం కలవారని, తమ ప్రతిభతో జిల్లాకు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావాలని షబ్బీర్ అలీ ఆకాంక్షించారు. వైద్య విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలని, వైద్య శాస్త్రంలో మారుతున్న పరిజ్ఞానాన్ని అలవరచుకోవడం అవసరమని తెలిపారు. ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ముఖ్యంగా వైద్య విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆధునిక సౌకర్యాలు, సంక్షేమ పథకాలను అందించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వాల్య రాథోడ్, మున్సిపల్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి, గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
త్వరలో ఇండోర్ స్టేడియం పనులు
పట్టణంలోని ఇందిరా స్టేడియం పనులు త్వరలో ప్రారంభం అవుతాయని షబ్బీర్ అలీ తెలిపారు. స్థానిక ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో (R&B Guest House) అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇండోర్ స్టేడియం పనులు చేపట్టడానికి స్థలం తక్కువ కావడంతో విద్యాశాఖ చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) స్థలం మంజూరు కోసం ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. పనులు చేపట్టడానికి కావాల్సిన 33 గుంటలు ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. త్వరలో పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఇండోర్ స్టేడియం పనులు చేపడతామన్నారు. క్రీడాకారులకు కావాల్సిన అన్ని వసతులు స్టేడియంలో కల్పిస్తామన్నారు. భవిష్యత్తులో కామారెడ్డి నుంచి గొప్ప క్రీడాకారులు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..: SSC Exam Vigilance | పరీక్షల సమయంలో అప్రమత్తంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య

