అక్షరటుడే, బోధన్ : Domestic Cylinders Seized | గృహావసరాల సిలిండర్లను వినియోగిస్తున్న హోటళ్లపై సివిల్ సప్లయ్ అధికారులు (Civil Supplies Officials) నిత్యం దాడులు చేస్తున్నారు. గ్యాస్ కొరత నేపథ్యంలో డొమెస్టిక్ సిలిండర్లు కేవలం గృహాల్లోనే వినియోగించాలని వారు పేర్కొంటున్నారు. ఈ మేరకు బోధన్‌లో అధికారులు పలు సిలిండర్లను సీజ్ చేశారు.
Domestic Cylinders Seized | బోధన్ పట్టణంలో..
బోధన్ పట్టణంలోని దీపక్ స్వీట్ హోంపై శుక్రవారం ఉదయం సివిల్ సప్లయ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు 15 డొమెస్టిక్ సిలిండర్లను (Domestic cylinders) స్వాధీనం చేసుకొని వాటిని సీజ్ చేశారు. గృహావసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను వ్యాపారం నిమిత్తం హోటల్లో వాడుతుండడంతో దాడులు నిర్వహించినట్లు సివిల్ సప్లయ్ డీటీ పవన్ తెలిపారు. స్వీట్ హోమ్ యజమాని మహావీర్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా డీటీ మాట్లాడుతూ గ్యాస్ కొరత ప్రస్తుతం లేదని కాని డొమెస్టిక్ సిలిండర్లను కేవలం గృహ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు. ఎవరైనా వ్యాపారం నిమిత్తం డొమెస్టిక్ సిలిండర్లను వాడితే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. దాడుల్లో అధికారులు మహేష్, రాజు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Chain Snatching | రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. భర్తతో నడుచుకుంటూ వెళ్తుండగానే భార్య మెడలో నుంచి బంగారం చోరీ

