అక్షరటుడే, కామారెడ్డి: Double Bedroom House Protest | తన కుటుంబ ఆర్థిక పరిస్థితి (Kamareddy news) బాగాలేదని తెలిసి.. అద్దె ఇంట్లో ఉంటున్నానని తెలిసి కూడా తన పేరు డబుల్ బెడ్ రూం ఇళ్ల (Double bedroom houses) జాబితాలో రాకుండా చేశారని ఓ బాధితుడు ఆత్మహత్యా యత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతన్ని అడ్డుకుని కాపాడారు. ఈ ఘటన రాజంపేట మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది.
Double Bedroom House Protest | రాజంపేట మండలానికి చెందిన..
బాధితుడి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ హైమద్కు నలుగురు కూతుళ్లు ఉన్నారు. దాదాపు రెండేళ్ల నుంచి (housing protest) అద్దెకు ఉంటున్నాడు. గ్రామంలో నిర్మించిన డబుల్ ఇళ్ల జాబితా లిస్టులో (Telangana housing) పేరు వచ్చింది. హొలీ పండుగ కంటే ముందు మొదటి, రెండు జాబితాలో (Double bedroom scheme) పేరు వచ్చినా ఇల్లు కేటాయించలేదు. హొలీ రోజు డబుల్ ఇళ్ల పంపిణీ చేసిన సమయంలో తాను అక్కడికి వెళ్లకుండా పోలీస్ స్టేషన్లో ఉంచారని బాధితుడు ఆరోపించారు. బుధవారం గ్రామసభ సందర్భంగా డబుల్ ఇళ్ల జాబితా లిస్టులో పేరు వచ్చినా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించినా స్పందించలేదన్నారు. దాంతో తహశీల్దార్ కాళ్లు మొక్కినా కనికరించలేదని వాపోయాడు. గత్యంతరం లేక సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు (police rescue) అడ్డుకున్నారు. దాంతో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Hanuman Jayanti | ఇది నా పూర్వజన్మ సుకృతం.. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక వీడియో విడుదల చేసిన చిరంజీవి..
