అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Dr Vishal Akula | ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్ తెలంగాణ రాష్ట్ర కో ఛైర్మన్‌గా డాక్టర్ విశాల్ ఆకుల (dr vishal akula) నియమితులయ్యారు. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA junior doctors network) తెలంగాణ రాష్ట్ర శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Dr Vishal Akula | ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాల్లో..
ఐఎంఏ (telangana medical association) నిజామాబాద్ (IMA Nizamabad) అధ్యక్షుడు డాక్టర్ విశాల్ ఆకులను ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్ (IMA JDN) తెలంగాణ రాష్ట్ర కో-చైర్మన్‌గా 2026–2027కిగాను నియమించారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగ అభివృద్ధి, యువ వైద్యులకు ప్రోత్సాహం(medical community news), ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వైద్య సమాజానికి సేవలందిస్తున్నందున ఆయనకు ఈ పదవి ఇచ్చారు.
Dr Vishal Akula | బాధ్యతను సమర్థవంతంగా నెరవేరుస్తా..
ఈ సందర్భంగా డాక్టర్ విశాల్ ఆకుల మాట్లాడుతూ.. ఐఎంఏ తెలంగాణ (ima telangana) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్, గౌరవ రాష్ట్ర కార్యదర్శి అశోక్, గౌరవ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి దయాల్ సింగ్కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమకు ఎల్లప్పుడూ మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ రవీంద్ర రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి, యువ వైద్యుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి కోసం కృషి చేస్తానని డా.విశాల్ ఆకుల తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు, మిత్రులు విశాల్ ఆకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇది చదవండి: Viksit Bharat Youth Parliament | యువతే దేశానికి అమూల్యమైన సంపద..: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధు మోహన్

