Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Driving License Test | ఆ పరీక్ష పాస్​ అయితేనే డ్రైవింగ్​ లైసెన్స్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Driving License Test | ఆ పరీక్ష పాస్​ అయితేనే డ్రైవింగ్​ లైసెన్స్​

తెలంగాణ

Driving License Test | ఆ పరీక్ష పాస్​ అయితేనే డ్రైవింగ్​ లైసెన్స్​

రాష్ట్ర ప్రభుత్వం డ్రైవింగ్​ లైసెన్స్​ నిబంధనల్లో మార్పులు చేయనుంది. ఇక నుంచి ఆన్​లైన్​ పరీక్ష పాస్​ అయితేనే లైసెన్స్​ ఇవ్వనుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 22, 2026 7:04 సా.
Srinivas Kolluri
4 రోజులు ago
Share
Driving License Test

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Driving License Test | డ్రైవింగ్​ లైసెన్స్ (License)​ జారీ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం మార్చనుంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఇకపై ఆన్​లైన్​ పరీక్షలో పాస్​ కావాలి. కొత్త విధానం ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తుందని రవాణా శాఖ తెలిపింది.

Contents
  • Driving License Test | ఆన్​లైన్​లో పాఠాలు
    • Driving License Test | డబ్బులిస్తే చాలు

రోడ్డు ప్రమాదాల్లో నిత్యం ఎంతోమంది చనిపోతున్నారు. ఈ క్రమంలో వాహనదారుల్లో అవగాహన పెంపొందించడానికి ప్రభుత్వం రోడ్​ సేఫ్టీ అవెర్​నెస్​ (Road Safety Awareness) పరీక్షను ఆన్​లైన్​లో నిర్వహించనుంది. ఈ పరీక్షలో పాస్​ అయితేనే లైసెన్స్​ ఇస్తారు. ప్రస్తుతం లైసెన్స్ కోసం లెర్నర్​ లైసెన్స్​ టెస్ట్​, డ్రైవింగ్​ టెస్ట్ (Driving Test)​ నిర్వహిస్తున్నారు. వీటికి అదనంగా ఆన్​లైన్​ పరీక్షను నిర్వహించనున్నారు.

Driving License Test | ఆన్​లైన్​లో పాఠాలు

కొత్త లైసెన్స్​ విధానం ఏప్రిల్ మొదటి వారం నుంచి అమలులోకి రానుంది. దీని ప్రకారం లెర్నింగ్​ లైసెన్స్​ కోసం అప్లై చేసే ముందు వాహనదారులు మూడు గంటల పాటు ఆన్‌లైన్‌లో రోడ్డు భద్రతా పాఠాలు వినాల్సి ఉంటుంది. డ్రైవింగ్​లో నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోతాయని వీడియోల్లో వివరిస్తారు. అనంతరం పరీక్ష రాయాల్సి ఉంటుంది. కెమెరా ఉన్న కంప్యూటర్, లేదా ల్యాప్‌టాప్ ద్వారా ఇంట్లో నుంచే ఈ ఆన్​లైన్​ పరీక్ష రాయొచ్చు. ఇందులో పాస్​ అయితేనే లెర్నింగ్​ లైసెన్స్ (LLR)​ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. తొలుత ఈ విధానాన్ని హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి జిల్లాల్లో పైలెట్​ ప్రాజెక్ట్​గా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని యోచిస్తున్నారు.

test

Driving License Test | డబ్బులిస్తే చాలు

రాష్ట్రంలో డ్రైవింగ్​ లైసెన్స్​ల జారీ ప్రక్రియలో భారీగా అవినీతి జరుగుతోంది. నేరుగా స్లాట్ బుక్​ చేసుకొని లైసెన్స్​ కోసం వెళ్తే పలువురు అధికారులు ఎక్కడో ఒక దగ్గర తప్పును ఎంచి మరి క్యాన్సల్​ చేస్తారు. అదే ఏజెంట్​కు డబ్బులు ఇచ్చామంటే కళ్లు మూసుకొని లైసెన్స్​లు ఇస్తారు. ప్రస్తుతం లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్(LLR) పరీక్ష నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్, నిబంధనల గురించి ఇందులో ప్రశ్నలు ఉంటాయి. అయితే చాలా వరకు కార్యాలయా (RTO Office)ల్లో ఈ పరీక్షను అధికారులు, బ్రోకర్లే రాస్తారు. అనంతరం డ్రైవింగ్​ టెస్ట్​ ఉంటుంది. ఇందులో సైతం డబ్బులు ఇచ్చిన వారు వాహనం నడపకున్నా.. లైసెన్స్​లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కొత్త విధానంలో పరీక్ష తీసుకొచ్చిన వాహనదారులు రాస్తారా.. లేక ఇతరులతో రాయిస్తారా అనేది చూడాలి.

దీనిని కూడా చదవండి : Jeevan Reddy Resignation | అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేను : జీవన్‌రెడ్డి

OBC Women Quota | మహిళా రిజర్వేషన్​లలో ఓబీసీ కోటా అమలు చేయాలి : కవిత
Gym Heart Attack Death | జిమ్​ చేస్తూ హార్ట్​ ఎటాక్​తో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి మృతి
Kavitha Nizamabad visit | రేపు నిజామాబాద్​కు కవిత.. పార్టీపై ప్రకటన చేస్తారా?
Hyderabad Samosa Raid | హైదరాబాద్‌లో సమోసాల తయారీ కేంద్రంపై దాడి.. రూ. 5 లక్షల విలువైన ఆహార పదార్థాల స్వాధీనం
KTR Congress Guarantees | గ్యారంటీల పేరుతో కాంగ్రెస్​ ఓట్లు కొట్టేసి.. 4 కోట్ల మందికి టోపీ పెట్టింది..: కేటీఆర్​
TAGGED:driving licenseDriving License Testdriving testHyderabadroad safety testrto office
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana minorities issue | Telangana minorities issue | మైనారిటీలకు మొండిచేయి చూపించిన తెలంగాణ సర్కార్..
Next Article urea shortage warning urea shortage warning | యూరియా కొరత వచ్చే అవకాశం : సీఎం రేవంత్​రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?