అక్షరటుడే, నిజామాబాద్ క్రైం/ఆర్మూర్: Drunk Driving Nizamabad | డ్రంకన్ డ్రైవ్లో (drunk driving nizamabad) పలువురికి జైలుశిక్ష విధిస్తూ నిజామాబాద్(Nizamabad Court), ఆర్మూర్ న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. ఈ మేరకు నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali), ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ వివరాలు వెల్లడించారు.
Drunk Driving Nizamabad | 29 మంది మద్యం తాగి..
నగరంలోని పలు ముఖ్యమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 29మంది మద్యం తాగి వాహనాలు నడిపినట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా ముగ్గురికి వారంరోజుల జైలుశిక్ష విధించారు. మరో 26మందికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున కోర్టు జరిమానా విధించినట్లు ఏసీపీ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Drunk Driving Nizamabad | ఆర్మూర్లో..
డ్రంకన్ డ్రైవ్లో ఇద్దరికి జైలుశిక్ష విధిస్తూ (motor vehicle act india) ఆర్మూర్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ మేరకు ఆర్మూర్ ఎస్హెచ్ఎవో సత్యనారాయణ గౌడ్ వివరాలు వెల్లడించారు. పట్టణంలో స్పెషల్ డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా 11మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించామన్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపర్చగా 9మందికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారని.. ఇద్దరికి ఐదురోజుల చొప్పున సాధారణ జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చినట్లు ఎస్హెచ్వో తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే మోటార్ వెహికల్ నూతన చట్టం (traffic rules) ప్రకారం భారీగా జరిమానాలు, జైలుశిక్ష విధించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి : Nizamabad Canal Car Accident | కెనాల్లో బోల్తాపడ్డ కారు.. ఇద్దరు మృతి

