అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Drunk Driving WhatsApp Group | పోలీసుల డ్రంకన్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకోవడానికి కొందరు మందుబాబులు మాస్టర్ ప్లాన్ వేశారు. వాట్సాప్‌లో గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎక్కడ తనిఖీలు జరుగుతున్నాయో షేర్ చేసుకుంటున్నారు. ఈ గ్రూప్‌కు ఏకంగా పోలీసు మామలు అని పేరు పెట్టారు.
రాష్ట్రంలో నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు (Road Accidents) చోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే చాలా వరకు మద్యం తాగి వాహనాలు నడపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు విస్తృతంగా డ్రంకన్ డ్రైవ్ (Drunk Driving) తనిఖీలు చేస్తున్నారు. పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టులో హాజరు పరుస్తున్నారు. న్యాయస్థానాలు మందుబాబులకు భారీగా జరిమానాలు విధించడంతో పాటు జైలు శిక్ష సైతం విధిస్తూ తీర్పు చెబుతున్నాయి. దీంతో డ్రంకన్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకోవడానికి గోదావరిఖనిలో కొంతమంది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు.
Drunk Driving WhatsApp Group | 1024 మంది సభ్యులు
డ్రంకన్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకోవడానికి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని (Godavarikhani)లో పోలీసు మామల స్క్వాడ్ పేరిట వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఇందులో మొత్తం 1024 మంది సభ్యులు ఉన్నారు. ఏ మార్గంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారో ఇందులో పెట్టేవారు. ఇటీవల ఓ వ్యక్తి డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో దొరికాడు. అతడి ఫోన్ చెక్ చేయగా అసలు విషయం వెలుగు చూసింది.
Drunk Driving WhatsApp Group | ఎస్సై ఎంట్రీ.. మందుబాబుల జంప్
మందుబాబుల గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలియడంతో ఓ ఎస్సై అందులో చేరారు. అనంతరం ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఒక్కసారిగా గ్రూప్‌లో ఎంట్రీ అయి ఎస్సై షాక్ ఇవ్వడంతో మందుబాబులు ఎగ్జిట్ అయ్యారు. ‘మామలూ.. మీ నంబర్లన్నీ సేవ్ చేసుకున్నా.. మీకు కౌన్సెలింగ్ ఇస్తా’ అంటూ ఎస్సై వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో సైతం ఇలాంటి గ్రూప్‌లు ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి..: Footpath Encroachment Drive | ఫుట్‌పాత్ ఆక్రమణలపై కొరఢా
