అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dubai Iran Attacks | ఇరాన్ ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్ (Middle East)లో ఉద్రిక్తత నెలకొంది. గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకొని టెహ్రాన్ దాడులకు పాల్పడుతోంది. దీంతో ఆయా దేశాల్లోని భారతీయలు, తెలుగు వారు ఆందోళన చెందుతున్నారు.
ఇరాన్‌పై శనివారం ఉదయం ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున క్షిపణులను టెహ్రాన్‌పై ప్రయోగించాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైతం దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై వైమానిక దాడులు ప్రారంభించింది. అయితే ఇరాన్ క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు బహ్రెయిన్, కువైట్ (Kuwait), ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో సహా అనేక దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఆయా దేశాల్లోని అమెరికా, ఇజ్రాయెల్ ఆస్తులు, సైనిక స్థావరాలపై క్షిపణులను ప్రయోగించింది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Dubai Iran Attacks | తెలుగు వారిలో ఆందోళన
గల్ఫ్ దేశాల్లో ఎంతో భారతీయులు నివసిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారు అనేక మంది ఆయా దేశాలకు వలస వెళ్లారు. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారితో పాటు, ఇక్కడ వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇరాన్ దాడులతో ఇప్పటికే ఆయా దేశాల్లో ఎయిర్ స్పేస్‌లను మూసివేశారు. మరోవైపు దుబాయిలో గల ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా (Burj Khalifa)ను సైతం అధికారులు ఖాళీ చేయించారు. ఇరాన్ ఆ భవనంపై దాడులకు దిగితే భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. దీంతో అధికారులు అందులో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే దుబాయి ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టును అధికారులు మూసి వేశారు.
Dubai Iran Attacks | ఇరాన్ రక్షణ మంత్రి మృతి
ఇజ్రాయెల్ (Israel) దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి చెందినట్లు సమాచారం. అజీజ్ నాసీర్‌జాదే మృతి చెందాడని వార్తలు వస్తున్నాయి. ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ సైతం చనిపోయారు. మధ్యప్రాచ్యంలో ప్రస్తుత ఉద్రిక్తతలపై ఆయా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా బతుకు దెరువు కోసం పొట్ట చేత పట్టుకొని వలస వెళ్లిన తెలుగు వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు ఫోన్లు చేసి పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
నిలిచిపోయిన విమానాలు
ఇరాన్-ఇజ్రాయెల్ దాడులతో ఇరాక్, కువైట్, బహ్రెయిన్ (Bahrain), ఖతర్‌లో ఎయిర్‌స్పేస్‌లను మూసివేశారు. దుబాయ్ నుంచి అన్ని విమాన సర్వీసులను ఎమిరేట్స్ నిలిపివేసింది. దుబాయ్ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన ఎమిరేట్స్ విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. భారత ప్రయాణికులకు డీజీసీఈ కీలక సూచనలు చేసింది. మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించింది.
ఇది కూడా చదవండి : Israel Iran Attacks | ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు..

