అక్షరటుడే, ఇందూరు: EAPCET Coaching Classes | జిల్లా కేంద్రంలోని ఏబీవీపీ ఇందూర్ (abvp indur) ఆధ్వర్యంలో ఈఏపీసెట్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. నగరంలోని(Nizamabad) కవితా కాంప్లెక్స్‌లో ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో (SSR Degree college) తరగతులను ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏబీవీపీ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి చిరిగె శివకుమార్ ప్రారంభించారు.
EAPCET Coaching Classes | ఉచిత శిక్షణ తరగతులు అభినందనీయం..
ఈ సందర్భంగా చిరిగె శివకుమార్ మాట్లాడుతూ.. ఏబీవీపీ(free coaching classes) పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల గొంతుక అని(entrance exam preparation) అన్నారు. పేద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఏబీవీపీ ముందుండి వారి సమస్య పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. దీనికి ఉదాహరణే ఏబీవీపీ ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఈఏపీసెట్ EAPCET శిక్షణా తరగతులు అని తెలియజేశారు. దాదాపు 200 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో(eapcet coaching) చదివిన పేద విద్యార్థులకు 35 రోజులు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు.
EAPCET Coaching Classes | ఏబీవీపీ అంటే ఉద్యమాలే కాదు..
ఏబీవీపీ అంటే ఉద్యమాలే కాదని.. సేవా కార్యక్రమాలు, సమాజ హితం కోసం, దేశ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని శివకుమార్ అన్నారు. పేద విద్యార్థులకు విద్య అంటే అందని ద్రాక్షగా మారుతున్న ఈ రోజుల్లో.. విద్యార్థులకు వేసవి సెలవుల్లో వారి భవిష్యత్తు కోసం ఆలోచించి ఈఏపీసెట్ ఉచిత శిక్షణా తరగతులు అందించడం జరుగుతుందన్నారు. ఏబీవీపీ (government college students) దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటాక్ నుండి కటక్ కొరకు వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఎన్నో సేవా కార్యక్రమాలు, ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ (telangana students) ఇందూరు విభాగ్ ప్రముఖ్ రెంజర్ల నరేష్, ఎస్ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి, ఇందూరు జిల్లా కన్వీనర్ అక్షయ్, జాతీయ కార్యవర్గ సభ్యులు హర్షవర్ధన్, జిల్లా ప్రముఖ్ ఈశ్వర్, ప్రాంత హాస్టల్స్ ప్రముఖ్ సూర్య కుమార్, స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ శివ, విభాగ్ కన్వీనర్ శశి, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృత్చారి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ శివ, ఆఫీస్ సెక్రటరీ దుర్గాదాస్, ఏబీవీపీ నాయకులు విగ్నేష్ ప్రేమ్ తదితరులు ఉన్నారు.
