అక్షరటుడే, వెబ్‌డెస్క్ : East Godavari accident | ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా యర్నగూడెం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. అనంతరం మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
దేవరపల్లి (Devarapalli) మండలం యర్నగూడెం వద్ద జాతీయ రహదారి (National Highway)పై ఆదివారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రి నుంచి విజయవాడ (Vijayawada) వైపు వెళ్తున్న ఓ కారు, ఫ్లైఓవర్‌పై అదుపు తప్పింది. ముందుగా డివైడర్‌ను ఢీకొంది. అనంతరం పక్క లేన్‌లోకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
East Godavari accident | కేసు నమోదు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కార్లలో చిక్కుకున్న వారిని శ్రమించి బయటకు తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Cyber fraud Hyderabad | మాజీ డీజీపీ మనవరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా

