Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Eatala Rajender Comments | పార్టీ మార్పు ప్రచారంపై ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Eatala Rajender Comments | పార్టీ మార్పు ప్రచారంపై ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు

తెలంగాణ

Eatala Rajender Comments | పార్టీ మార్పు ప్రచారంపై ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు

తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఎంపీ ఈటల రాజేందర్​ ఖండించారు. పార్టీ మారడం బట్టలు మార్చుకున్నంత సులభం కాదన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 5, 2026 11:50 ఉద.
Srinivas Kolluri
15 గంటలు ago
Share
Eatala Rajender Comments

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eatala Rajender Comments | మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్​ బీజేపీ (BJP)కి రాజీనామా చేస్తారని ఇటీవల ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన తాజాగా స్పందించారు. తాను పార్టీ మారుతానని పిచ్చి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్​ఎస్ (BRS)​ హయాంలో మంత్రి పదవి నుంచి తప్పించడంతో ఈటల రాజేందర్​ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. హుజురాబాద్​ (Huzurabad) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, అనంతరం ఉప ఎన్నికల్లో గెలిచారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం హుజురాబాద్​లో ఓడిపోయారు. దీంతో బీజేపీ ఆయనకు మల్కాజ్​గిరి ఎంపీ టికెట్ ఇవ్వగా.. విజయం సాధించారు. అయితే ఇటీవల ఆయన పార్టీ మారతారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీలో కొందరు ఆ ప్రచారానికి ఊతమిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Eatala Rajender Comments | ప్రభుత్వంపై ఉద్యమం చేస్తాం

తనను కేసీఆర్ (KCR) బయటికి నెట్టి ఐదేళ్లవుతుందని ఈటల రాజేందర్ అన్నారు. ఆనాడు చెప్పుకుందామన్నా ఎవరూ వినలేని పరిస్థితి ఉందని గుర్తు చేసుకున్నారు. తాను, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ పార్టీ మారుతున్నామన్నది అవాస్తవం అని స్పష్టం చేశారు. పార్టీ మారడం బట్టలు మార్చుకున్నంత సులభం కాదన్నారు. పదవుల కోసం పద్దులు మోసే వ్యక్తిని కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత వస్తోందని ఆయన తెలిపారు. జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డుపై సుప్రీంలో కేసువేస్తామని చెప్పారు. GHMCఎన్నికలపై ఎంపీలు రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వరరావుతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామని ఈటల పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Encroachment Drive | ఫుట్​పాత్​లపై ఆక్రమణల తొలగింపు.. సికింద్రాబాద్​లో ఉద్రిక్తత

Telangana Rain Alert | నేడు రాష్ట్రానికి వర్ష సూచన
Elevated Flyover NHAI | ఎలివేటెడ్​ ఫ్లై ఓవర్​ నిర్మాణానికి ఎన్​హెచ్​ఏఐ ఆమోదం
Face Recognition Schemes | ఇకపై అన్ని పథకాలు ఫేస్ రికగ్నిషన్‌తోనే.. రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం
Adoor Congress Campaign | అడూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు వ్యూహాత్మక ప్రచారం!
Telangana Hailstorm Rain | పలు​ జిల్లాల్లో వడగళ్ల వాన.. ఆందోళనలో రైతులు
TAGGED:BJP TelanganaEatala RajenderIndian Politics NewsMalkajgiri MPparty change rumorsTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Ranganayaka Sagar Ranganayaka Sagar | రంగనాయక సాగర్​లోకి ఎత్తిపోతలు ప్రారంభం
Next Article Hyderabad Love Fraud Hyderabad Love Fraud | హైదరాబాద్‌లో అమానుషం.. ప్రేమ పేరుతో మతాంతర వివాహం చేసుకొని మోసం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?