అక్షరటుడే, వెబ్‌డెస్క్ : జీడిమెట్ల (Jeedimetla) డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఎమ్మెల్యే, ఎంపీ నిధులతో నిర్మించిన నూతన కమ్యూనిటీ హాల్‌ను ఎంపీ ఈటల రాజేందర్ ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీలు ఏవైనా కావచ్చు కానీ.. ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేసే కర్తవ్యమే ఉంటుంది తప్ప, వేరే పని చేసే ఆస్కారం ఉండదన్నారు.
రాఘవేంద్ర కాలనీ (Raghavendra Colony)లో ఎమ్మెల్యే నిధులు తెచ్చి ఇచ్చిన, ఎంపీగా తాను నిధులు తెచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా, మున్సిపాలిటీ ఇచ్చినా.. ప్రజలు కట్టిన పన్నులకు తాము కాపలాదారులము మాత్రమే అని ఈటల (Eatela Rajender comments) అన్నారు. “మేమే ఇస్తున్నాం, మేమే ఇస్తున్నాం” అని అనుకోవడానికి లేదని పేర్కొన్నారు. ప్రజల డబ్బులకు తాము కాపలాగా ఉంటూ ఇంత పని చేయిస్తాము తప్ప అంతకన్నా ఏమీ లేదని చెప్పారు. ఎవరికి అవకాశం ఉంటే వారు చేస్తారన్నారు.
Eatela Rajender comments | గొప్ప నిర్మాణం
ఈ కమ్యూనిటీ హాల్ కోసం తాము ఇచ్చిన నిధులకు, స్థానికులు సైతం మరికొన్ని డబ్బులు జమ చేసుకొని కట్టారన్నారు. అన్ని పనులు ప్రభుత్వమే చేసేటటువంటి కెపాసిటీ ఉండదన్నారు.
కాలనీ అసోసియేషన్లు, గేటెడ్ కమ్యూనిటీలు, మిగతా సంఘాలు అందిస్తుంటారని తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతామన్నారు. ఎమ్మెల్యే వివేకానంద (MLA Vivekananda), నాయకులు భరత్ సింహారెడ్డి, మల్లారెడ్డి, గిరివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : Rotten meat storage | కోల్డ్ స్టోరేజీ నిండా కుళ్లిన మాంసం.. షాకైన అధికారులు
