Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Eatela Rajender Speech | ప్రజాసేవకే అంకితమవ్వాలి.. : ఎంపీ ఈటల రాజేందర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Eatela Rajender Speech | ప్రజాసేవకే అంకితమవ్వాలి.. : ఎంపీ ఈటల రాజేందర్​

నిజామాబాద్

Eatela Rajender Speech | ప్రజాసేవకే అంకితమవ్వాలి.. : ఎంపీ ఈటల రాజేందర్​

గెలుపు గర్వంతో కాకుండా ప్రజాసేవకే అంకితమవ్వాలని ఎంపీ ఈటల రాజేందర్​ అన్నారు. బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు సన్మాన కార్యక్రమాన్ని నగర శివారులోని కమ్మ సంఘంలో ఏర్పాటు చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 6, 2026 3:44 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Eatela Rajender Speech
Eatela Rajender Speech

అక్షరటుడే, ఇందూరు: Eatela Rajender Speech | గెలుపు గర్వంతో కాకుండా ప్రజాసేవకే అంకితమవ్వాలని ఎంపీ ఈటల రాజేందర్​ అన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్​ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కౌన్సిలర్లు (BJP Councilors), కార్పొరేటర్లకు సన్మాన కార్యక్రమాన్ని నగర శివారులోని కమ్మ సంఘంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య​ అతిథిగా ఎంపీ ఈటల హాజరై మాట్లాడారు.

Contents
  • Eatela Rajender Speech | హుందాగా వ్యవహరించాలి..
    • Eatela Rajender Speech | రైతులతో పెట్టుకున్న ఏ పార్టీ బతికి బట్టకట్టలేదు..
      • Eatela Rajender Speech | డీఎస్​ మానవతావాది..
      • Eatela Rajender Speech | ఇద్దరం కలిసి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం.. ఎంపీ అర్వింద్​
      • హుందాగా ఉండడం ఈటలతోనే సాధ్యం..
      • కార్పొరేటర్లు ప్రజలతో మమేకం అవ్వాలి..
      • జిల్లా అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు…

Eatela Rajender Speech | హుందాగా వ్యవహరించాలి..

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు హుందాగా వ్యవహరించాలన్నారు. గెలుపు గర్వంతో ముందుకు వెళ్లే భవిష్యత్తు రాజకీయం అంధకారమవుతుందన్నారు. అలాగే ప్రజలకు సేవ చేసినప్పుడు గుర్తింపు వస్తుందన్నారు.

Eatela Rajender Speech | రైతులతో పెట్టుకున్న ఏ పార్టీ బతికి బట్టకట్టలేదు..

రాజకీయ చరిత్రలో రైతులతో పెట్టుకున్న ఏ పార్టీ కూడా బతికి బట్టకట్టలేదని మల్కాజ్​పురి ఎంపీ ఈటల పేర్కొన్నారు. ఒకప్పుడు బీఆర్​ఎస్​ (BRS) విర్రవీగిన తనంతో ముందుకు వెళ్లిందన్నారు. ప్రజలు, రైతులను, ఉద్యోగులను పట్టించుకోకుండా అహంకారపూరిత పాలన చేసిందన్నారు. చివరికి ఆ పార్టీలో మట్టిలో కలిసిపోయిందన్నారు.​

Eatela Rajender Speech | డీఎస్​ మానవతావాది..

తాను అసెంబ్లీలో బడ్జెట్​ ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న డీఎస్​ మాట్లాడుతూ ఒకప్పుడు తన రాజకీయ గురువైన అర్గుల రాజారాం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్​తో ఈటల బడ్జెట్​ పోలి ఉందని కితాబునిచ్చారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ డీఎస్ హుందాతనం ప్రదర్శించేవారన్నారు. ప్రతిపక్షం అంటేనే విమర్శించడం కాదని.. అధికార పక్షం అటే అధికారం చూపడం మాత్రమే కాదన్నారు.

Eatela Rajender Speech

Eatela Rajender Speech

Eatela Rajender Speech | ఇద్దరం కలిసి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం.. ఎంపీ అర్వింద్​

హుందా రాజకీయాలు ఇందూరు పార్లమెంట్​ను చూసి నేర్చుకోవాలని ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Dharmapuri Arvind) అన్నారు. తెలంగాణ మొత్తంలో నిజామాబాద్​లోనే అత్యధిక కార్పొరేటర్ కౌన్సిలర్ సీట్లు బీజేపీ గెలిచిందని స్పష్టం చేశారు. తాము ఎవరిని కొనుక్కొని రాజకీయాలు చేయమన్నారు. హిందువులలో అత్యధిక కార్పోరేటర్ సీట్లను తాము గెలిచామని, మిగిలిన వాటిని కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కై మేయర్ సీటును కైవసం చేస్తుందన్నారు. అంతేకానీ ప్రజల ఆశీర్వాదంతో మేయర్ సీటును అందుకోలేదన్నారు. తాము ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా ఇలాగే చేసిందని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో కూడా రోజులను తగ్గించడం, ప్రశ్నించే వారిని అణగదొక్కడం చేసిందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ బీజేపీ తన సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోను రాష్ట్రంలోనే ఇందూరు పార్లమెంటు పరిధిలో అత్యధిక ఎమ్మెల్యేలను గెలిపిస్తానని తెలిపారు.

హుందాగా ఉండడం ఈటలతోనే సాధ్యం..

తెలంగాణ వ్యాప్తంగా హుందాగా ఉండే నాయకుల్లో ఎంపీ ఈటల రాజేందర్ ఒకడని కొనియాడారు. అందుకే కార్పొరేటర్ల సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించామని పేర్కొన్నారు. ఇద్దరం కలిసి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని మాట్లాడినట్లు తెలిపారు. ఈటెల సౌమ్యుడని.. తాను వేగమని చమత్కరించారు.

కార్పొరేటర్లు ప్రజలతో మమేకం అవ్వాలి..

గెలుపొందిన కార్పోరేటర్లు కౌన్సిలర్లు ప్రజలతో మమేకం అవ్వాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ (MLA Dhanpal) సూర్యనారాయణ గుప్తా అన్నారు. నిత్యం అభివృద్ధి కోసం ఆలోచన చేయాలని దీంతో ప్రజల చేయూత ఎప్పటికీ ఉంటుందన్నారు. అలాగే రాజకీయ భవిష్యత్తు కూడా మెండుగా ఉంటుందన్నారు. తాను నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి తీసుకొస్తానన్నారు.

జిల్లా అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు…

బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎంపీ అర్వింద్​ మాట్లాడుతూ.. భవిష్యత్తులో మేయర్ పీఠాన్ని తాము కైవసం చేసుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. ఎంపీ ఏదైనా మాట్లాడితే కచ్చితంగా చేసి తీరుతారని దానికి ఒక అర్థం ఉంటుందని తెలిపారు. రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకొని జిల్లా పరిషత్ ఛైర్మన్ కైవసం చేసుకుంటామన్నారు.

మరో ఎక్స్ అఫీషియో ఓటు బీజేపీకి వస్తుందని అలాగే మరో ఎమ్మెల్సీ స్థానం కూడా ఖాళీ అవుతుందని అది కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. దీంతో ఎక్స్ అఫీషియల్ సభ్యుల సంఖ్య కాంగ్రెస్ కంటే తమకే ఎక్కువగా పెరుగుతుందని చెప్పారు. అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యే అని కూడా గెలిపించుకోవాలని ఈ లెక్కతో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. అనంతరం నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో గెలుపొందిన కౌన్సిలర్లు కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, జిల్లా ప్రబారి కాంతారావు, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Rajyadhikara Party | తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

Gas Cylinder Queues | సిలిండర్ల కోసం బారులు.. ఏజెన్సీల వద్ద పోలీసు భద్రత
London Fire Incident | లండన్​లో నిజామాబాద్​ విద్యార్థి మృతి
ASHA Workers Strike | ఆశావర్కర్ల సమ్మెకు బీఆర్​ఎస్​ సంపూర్ణ మద్దతు: మాజీ ఎమ్మెల్యే బిగాల
YEllareddy Science Fair | అలరించిన ప్లానిటోరియం.. అబ్బురపర్చిన సైన్స్​ఫెయిర్​
Anganwadi Chalo Hyderabad | అంగన్​వాడీల ‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలి..
TAGGED:bjp councillors meetingBJP Councilorsbjp leaders telanganacorporators felicitation eventdharmapuri arvind speechDinesh KulachariMLA DhanpalMP Dharmapuri ArvindNizamabad political newstelangana bjp politicsTelangana political news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article UPSC Civil Services Results UPSC Civil Services Results | సివిల్ సర్వీసెస్​ ఫలితాల విడుదల
Next Article Social Media Ban Kids Social Media Ban Kids | 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్​ మీడియా బ్యాన్ ​: ఏపీ సీఎం చంద్రబాబు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?