అక్షరటుడే, వెబ్‌డెస్క్: Eating Direction Vastu | ఆహారం మన శరీరానికి ఇంధనం వంటిది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, మనం తినే ఆహారం కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా మన మనస్సు, ఆత్మపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలు, ముఖ్యంగా కూర్చునే దిశను పాటించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
Eating Direction Vastu | దిశలు , వాటి ప్రాముఖ్యం:
వాస్తు ప్రకారం ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది అధిపతులు ఉంటారు. తూర్పునకు ఇంద్రుడు, ఉత్తరానికి కుభేరుడు, పడమరకు వరుణుడు, దక్షిణానికి యముడు అధిపతులు. ఈ దిశల ప్రభావం మన జీర్ణక్రియపై, ఆర్థిక స్థితిగతులపై ఉంటుంది.
Eating Direction Vastu | ఏ దిశలో భోజనం చేయాలి?
తూర్పు దిశ (ఆరోగ్యం): సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కు సానుకూల శక్తికి నిలయం. ఈ వైపు తిరిగి భోజనం చేయడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, ఆయుష్షు వృద్ధి చెందుతుంది. చదువుకునే విద్యార్థులకు ఇది అత్యంత శ్రేష్ఠమైన దిశ.
ఉత్తర దిశ (సంపద): కుభేరుడి దిశ అయిన ఉత్తరం వైపు కూర్చుని తినడం వల్ల ఐశ్వర్యం, శ్రేయస్సు లభిస్తాయి. కెరీర్‌లో ఎదగాలనుకునే వారు, వ్యాపారస్తులు ఈ దిశను ఎంచుకోవడం మంచిది.
పశ్చిమ దిశ (సమృద్ధి): పడమర వైపు తిరిగి భోజనం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి, ఆరోగ్యం చేకూరుతుంది. నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల అన్నపూర్ణ దేవి ఆశీస్సులు లభిస్తాయి.
పాటించాల్సిన ముఖ్య సూత్రాలు
భోజనానికి ముందు కాళ్లు, చేతులు, నోరు శుభ్రం చేసుకోవడం వల్ల శరీరంలోని ప్రతికూలత తొలగిపోతుంది. తినేటప్పుడు టీవీ, మొబైల్ వంటి వాటికి దూరంగా ఉండి, ప్రశాంతంగా ఆహారాన్ని స్వీకరించాలి. నిటారుగా కూర్చుని భోజనం చేయడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. పడుకుని లేదా వంగి తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. భోజనం తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల తిన్న ఆహారం ఒంటికి పడుతుంది.
ఇది కూడా చదవండి: Good Luck Signs | అదృష్టం వరించే ముందు వచ్చే సంకేతాలివే.. ఇంట్లో ఇవి కనిపిస్తే ఇక తిరుగులేనట్టే!

