Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Education Budget Demand | విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలి: టీపీటీఎఫ్​ డిమాండ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Education Budget Demand | విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలి: టీపీటీఎఫ్​ డిమాండ్​

నిజామాబాద్

Education Budget Demand | విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలి: టీపీటీఎఫ్​ డిమాండ్​

విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్​ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ఎన్టీఆర్​ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్​ కార్యాలయ అధికారికి మెమోరాండం అందజేశారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 24, 2026 9:26 సా.
Shashi kiran Mottala
4 రోజులు ago
Share
Education Budget Demand | విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలి: టీపీటీఎఫ్​ డిమాండ్​
Education Budget Demand | విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలి: టీపీటీఎఫ్​ డిమాండ్​

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Education Budget Demand | విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలని టీపీటీఎఫ్(tptf protest) జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్​ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ఎన్టీఆర్​ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్​ కార్యాలయ అధికారికి మెమోరాండం అందజేశారు.

Contents
  • Education Budget Demand | రెండున్నరేళ్లుగా ఉపాధ్యాయులపై వివక్ష..​
    • Education Budget Demand | పీఆర్​సీ నివేదిక గుడువు పెంచుకుంటూ..
      • ఉపాధ్యాయులను అవమానించడమే..
      • బడ్జెట్​లో అరకొర నిధులు..

Education Budget Demand | రెండున్నరేళ్లుగా ఉపాధ్యాయులపై వివక్ష..​

టీపీటీఎఫ్​, ఉపాధ్యాయ సంఘాల ఐక్య కూటమి (USPC), ఇతర ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు జేఏసీగా ఏర్పడి ఉపాధ్యాయుల సమస్యలపై రెండున్నరేళ్లుగా అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందన్నారు. నామమాత్రపు హామీలు, ప్రకటనలతోనే రెండున్నరేళ్లు గడిచిపోయిందని వివరించారు. ఒక డీఎస్సీ ద్వారా కొద్దిమేర మెరుగైన స్టాఫ్ పాటర్న్ రావడం, 25,000 మందికి పదోన్నతులు రావడం ఆహ్వానించదగిందే కానీ.. ఈ రెండు తప్ప మెజారిటీ టీచర్లకు ఎలాంటి ప్రయోజనం జరగలేదన్నారు. మోడల్ స్కూల్​లో పనిచేస్తున్న టీచర్లకు హెల్త్ కార్డులు ఇవ్వలేదని.. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినట్లుగా సీపీఎస్​ రద్దు చేయలేదని.. ఓపీఎస్ తీసుకురాలేదని చెప్పారు.

Education Budget Demand | పీఆర్​సీ నివేదిక గుడువు పెంచుకుంటూ..

పాత ప్రభుత్వం వేసిన పీఆర్​సీ నివేదిక గడువు పెంచుకుంటూ పోవడమే తప్ప ఫలితం లేదని వెనిగల్ల సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి నాయకత్వాలు రిటైర్ అవుతున్నా.. కొత్త నాయకులు వస్తున్నా.. జాతీయ ధరల సూచిక ప్రకారం జీవన వ్యయం పెరుగుతున్నా నేటికి పీఆర్​సీ ప్రస్తావన చేయకపోవడం అన్యాయమన్నారు. బడ్జెట్ ప్రసంగంలో(budget allocation) కనీసం ఒక హామీపై కూడా మాట్లాడక పోవడం సరికాదన్నారు.

ఉపాధ్యాయులను అవమానించడమే..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ప్రకటన రాగానే గత పీఆర్​సీ(PRC) సూత్రం ప్రకారం రెండున్నరేళ్లుగా(public protest) చెల్లించాల్సిన 5 డీఏలు (కరవుభత్యం) చెల్లించక పోవడం ఉపాధ్యాయులను అవమానించడమేనని సురేష్​ అన్నారు. గోరు చుట్టపై రోకటి పోటులా ఆకునూరి మురళి కమిటీ ఇచ్చిన రిపోర్ట్​లో మన జీతాలు మార్కెట్​తో పోల్చినప్పుడు ఎక్కువగా ఉన్నాయనడం వారి బాధ్యతారాహిత్యానికి తార్కాణమన్నారు. ఇంతకీ ఏ మార్కెట్ జీతాలతో పోల్చారో వారికే తెలియాలని.. మన జీతాలను(nizamabad news) ప్రైవేట్ టీచర్ల జీతాలతో పోల్చి వారి శ్రమ దోపిడీని ప్రామాణికం చేస్తూ ఆకునూరి మురళి కమిటీ తిరోగమన దిశగా ఆలోచించడం ఆక్షేపనీయని ఆయన పేర్కొన్నారు. లక్షల కోట్లను అనేక పథకాల పేరుతో సివిల్ కాంట్రాక్ట్​ల కోసం కేటాయించే ప్రభుత్వం మన డీఏలు, పెన్షనర్ల ఆర్థిక చెల్లింపులు, జీపీఎఫ్​, టీఎస్​జీఎల్​ఐ, మెచ్యూరిటీ సొమ్ము, పీఆర్​సీ బకాయిలు చెల్లించడంలో ఖజానా సొమ్మంతా గత ప్రభుత్వం చేసిన అప్పులకే పోతుందని బీద పలుకులు పలకడం నమ్మ శక్యంగా లేదన్నారు.

బడ్జెట్​లో అరకొర నిధులు..

పాలక వర్గ పార్టీ ప్రభుత్వంలోకి రాక ముందు విద్యా రంగానికి 15శాతం కేటాయిస్తామని మాట ఇచ్చి (india education) నేటికి మూడో బడ్జెట్​లో కూడా 8.23శాతం శాతానికి దాటలేదని టీపీటీఎఫ్​ అధ్యక్షుడు విమర్శించారు. వైఈఈఆర్​ఎస్​, టీపీఎస్​, టీఎఫ్​ఎస్​ (YIIRS, TPS, TFS)ల పేరుతో కొత్త పాఠశాలలు స్థాపన కోసం ప్రణాళికలు చేస్తూ కేటాయింపులు చేయకపోవడం విడ్డూరమని.. కేజీబీవీ ఉపాధ్యాయులకు రెగ్యులర్ స్కేల్ ఇవ్వాలని సీపీఎస్​ను వెంటనే రద్దు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. రెగ్యులర్ ఎంఈవోలను భర్తీ చేసి పదోన్నతులు పూర్తి చేయాలని రెసిడెన్షియల్ పాఠశాలలో పనివేళలు టైం టేబుల్​ను సవరించాలని కోరారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్​ ప్రధాన కార్యదర్శి అర్వింద్​, వెంకట్, నరేందర్, చల్లా సత్యనారాయణ, మోహన్, మహేష్, అప్పారావు, కస్తూరి నరేష్, ప్రవీణ్, శిరీష, పేట నాయకులు నాంచారి శ్రీనివాస్, గోపిరెడ్డి మురళి, మహిళ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

tpftf1

ఇది కూడా చదవండి: Registration Server Issue | రాష్ట్రంలో నిలిచిన రిజిస్ట్రేషన్లు

Gas Cylinders | గ్యాస్​ సిలిండర్ల కొరత లేదు.. ఆందోళన చెందవద్దు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Fisheries Society | మత్స్య సహకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, డైరెక్టర్ రాజీనామా
Nizamabad Chain Snatching | రెచ్చిపోయిన చైన్​ స్నాచర్లు.. భర్తతో నడుచుకుంటూ వెళ్తుండగానే భార్య మెడలో నుంచి బంగారం చోరీ
Dr Vishal Akula | ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్ రాష్ట్ర కో ఛైర్మన్‌గా డాక్టర్​ విశాల్
Jadakoppulaata Festival | దూపెల్లిలో జడకొప్పులాట.. పాల్గొన్న పోలీస్ కమిషనర్
TAGGED:budget allocationindia educationNizamabad Newspublic protesttptf protest
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Registration Server Issue Registration Server Issue | రాష్ట్రంలో నిలిచిన రిజిస్ట్రేషన్లు
Next Article Fortune Atta Fortune Atta | ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ పిండి ఉత్పత్తుల శ్రేణి విస్తరణ.. ‘ఫార్చ్యూన్ మల్టీగ్రైన్ అట్టా’ విడుదల
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?