అక్షరటుడే, కామారెడ్డి: Elderly Mother Complaint | కన్నవారు వృద్ధాప్యంలో ఉంటే వారి బాగోగులు కొడుకులే చూసుకోవాలంటారు.. కాని నేటి సమాజంలో కొందరు కొడుకులు మాత్రం తమ తల్లిదండ్రుల పట్ల కాలయములవుతున్నారు.
Elderly Mother Complaint | దోమకొండ మండలానికి చెందిన..
వివరాల్లోకి వెళ్తే.. దోమకొండ మండల (Domakonda Mandal) కేంద్రానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలికి నలుగురు కూతుళ్లు.. ఇద్దరు కొడుకులు. కూతుళ్లకు పెళ్లిళ్లయ్యాయి. ఇద్దరు కొడుకులు ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. తల్లి పేరుపై ఉన్న భూమి, ఇల్లు వాళ్ల పేరుమీద చేసుకుని ఆమెను అనాథను చేశారు. తిండి కూడా పెట్టడం లేదు. దాంతో న్యాయం కోసం కలెక్టర్ (Collector) చెంతకు చేరింది. గ్రామానికి చెందిన వృద్ధురాలు నాగారపు అనసూయకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. ఒక కొడుకు ఆటో డ్రైవర్గా పని చేస్తుండగా మరొక కొడుకు మెకానిక్ పని చేస్తున్నాడు.
Elderly Mother Complaint | ఆమెకు తెలియకుండానే..
అనసూయ పేరున ఉన్న ఇల్లు, భూములు ఆమెకు తెలియకుండానే ఇద్దరు కొడుకులు వాళ్ల పేరుమీదకు మార్చుకున్నారని తెలిసింది. నాలుగు నెలల క్రితం అనసూయ కాలు విరగడంతో ఇబ్బందులు పడుతోంది. కొడుకులు, కోడళ్లు పట్టించుకోవడం లేదు. కనీసం తిండి కూడా పెట్టడం లేదు. ఈ విషయమై మండల అధికారుల వద్దకు వెళ్తే భూములన్నీ వాళ్లకు ఇచ్చేశాక మేమేమి చేస్తామంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం అనసూయ బాగోగులు కూతుళ్లే చూసుకుంటున్నారు. దాంతో తనకు న్యాయం చేయాలని ప్రజావాణి (Prajavani)లో కలెక్టర్కు ఆ వృద్ధురాలు మొరపెట్టుకుంది. న్యాయం చేయాలని వేడుకుంది.
ఇది కూడా చదవండి..: ACB Raids in Kamareddy | కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ సోదాల కలకలం

