Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Electric Pole Hazard | ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు.. పట్టించుకోని విద్యుత్​ అధికారులు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Electric Pole Hazard | ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు.. పట్టించుకోని విద్యుత్​ అధికారులు..

నిజామాబాద్

Electric Pole Hazard | ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు.. పట్టించుకోని విద్యుత్​ అధికారులు..

పట్టణంలోని ప్రధాన రోడ్లపై విద్యుత్​స్తంభాలు వాహనదారులను భయపెడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చిన స్తంభాలను విద్యుత్​శాఖ అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 6, 2026 11:55 ఉద.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Electric Pole Hazard |
Electric Pole Hazard | ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు.. పట్టించుకోని విద్యుత్​ శాఖాధికారులు..

అక్షరటుడే, కామారెడ్డి: Electric Pole Hazard | పట్టణంలోని ప్రధాన రోడ్లపై విద్యుత్​స్తంభాలు వాహనదారులను భయపెడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాల్లో రోడ్లపై ఉన్న స్తంభాలను విద్యుత్​శాఖ అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Contents
  • Electric Pole Hazard | నిజాంసాగర్​ రోడ్డులో..
    • Electric Pole Hazard | స్కూల్​ బస్సులు అదే దారిలో..

Electric Pole Hazard | నిజాంసాగర్​ రోడ్డులో..

కామారెడ్డి పట్టణంలోని (kamareddy news) నిజాంసాగర్ చౌరస్తా నుంచి జీవదాన్ పాఠశాల (Jeevadhan School) వెళ్లే దారిలో ఓ భారీ భవనంలో సూపర్ మార్కెట్, ఓ ప్రైవేటు పాఠశాల కొనసాగుతున్నాయి. ఆ పక్కనే మరో స్కూల్ (school zone risk) కూడా ఉంది. అలాగే కొద్ది దూరం ముందుకు వెళ్తే మూడు అపార్టుమెంట్లు ఉన్నాయి. వీటన్నిటికి వెళ్లే దారి సూపర్ మార్కెట్, లయోలా పాఠశాల మధ్యలో ఉంది. అయితే ప్రధాన రహదారికి ఆనుకుని పాఠశాలకు వెళ్లే దారిలో అటు ఇటువైపుగా సిమెంట్ విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. రోడ్డు మధ్యలో మాత్రం ఇనుప విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది.

Electric Pole Hazard | స్కూల్​ బస్సులు అదే దారిలో..

పాఠశాలలకు విద్యార్థులను తీసుకెళ్లేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కార్లు, బైక్​లపై వెళ్తుండగా రద్దీ ఏర్పడుతోంది. మధ్యలో విద్యుత్ స్థంభం ఉండడంతో రహదారి ఇరుకుగా మారుతోంది. అలాగే పాఠశాలలకు సంబంధించిన బస్సులు సైతం అదే దారిలో (traffic issues) వెళ్తుంటాయి. ఆ సమయంలో విద్యుత్ స్థంభానికి పక్క నుంచే ప్రమాదకరంగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు సూపర్ మార్కెట్ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి, దారిలో ఇనుప విద్యుత్ స్తంభానికి మధ్యలో నుంచి వెళ్ల డానికి కూడా అవకాశం లేదు. సిమెంట్ స్తంభం, ఇనుప స్తంభం మధ్యలో సపోర్ట్ వైరు ఉండడం కూడా ప్రమాదకరంగా మారుతోంది. ఈ క్రమంలో అనుకోని ఘటన జరిగితే ఎవరూ ఉహించలేని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది.

అయినప్పటికీ విద్యుత్ అధికారులు (Kamareddy Transco) మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆ దారి ప్రమాదకరంగా ఉందని పాఠశాలల యాజమాన్యాలు కూడా ఫిర్యాదు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రమాదం జరిగాక బాధపడకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రమాదకరంగా మారిన విద్యుత్ లైన్​ను సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు. మరి అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి.

trasco

 

ఇది కూడా చదవండి:  Iran US Conflict | దాడులు చేస్తే ఊరుకోం.. ట్రంప్​కు ఇరాన్​ వార్నింగ్​

 

Indiramma Houses Role | ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత..?: ఎమ్మెల్యే కేవీఆర్​
Red Sorghum Farmers Demand | ఎర్రజొన్న విత్తనాలు ఇచ్చిన వ్యాపారులే కొనుగోలు చేయాలి
Ayyappa Blessings | అయ్యప్ప ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగా: ఎమ్మెల్యే ధన్​పాల్​
Hut Fire Damage | గుడిసె దగ్ధం.. గండివేట్​లో ఘటన
Comrade Rayala Ravanna | రవన్న వర్ధంతి సభను జయప్రదం చేయండి
TAGGED:Jeevadhan SchoolKamareddy NewsKamareddy Transcoschool zone risktraffic issues
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Stock Market Losses Stock Market Losses | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. నష్టాల్లో సూచీలు
Next Article BJP Foundation Day BJP Foundation Day | జక్రాన్​పల్లిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?