Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Electricity Artisan Strike | సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తాం: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల అల్టిమేటం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Electricity Artisan Strike | సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తాం: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల అల్టిమేటం

నిజామాబాద్

Electricity Artisan Strike | సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తాం: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల అల్టిమేటం

తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తామని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 26, 2026 6:34 సా.
Srinivas Kolluri
12 గంటలు ago
Share
Electricity Artisan Strike

అక్షరటుడే, కామారెడ్డి/ బాన్సువాడ : Electricity Artisan Strike | తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తామని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు కామారెడ్డి (Kamareddy), బాన్సువాడ (Banswada) విద్యుత్​ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

Contents
  • Electricity Artisan Strike | కామారెడ్డి పట్టణంలోని..
    • Electricity Artisan Strike | బాన్సువాడలో..

Electricity Artisan Strike | కామారెడ్డి పట్టణంలోని..

పట్టణంలోని విద్యుత్ కార్యాలయం వద్ద తెలంగాణ (Telangana) విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి డివిజన్ ఛైర్మన్ సునీల్ గౌడ్ మాట్లాడుతూ.. ఆర్టిజన్ విద్యుత్ కార్మికులకు ఏపీఎస్ఈబీ (APSEB) సర్వీస్​ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో భాగంగా ఆర్టిజన్ కార్మికులను విద్యుత్ శాఖ శాశ్వత కార్మికులకు గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్లను అమలు చేయకపోతే వచ్చే నెల 8న రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కార్మికులు సమ్మె లోని వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

Electricity Artisan Strike | బాన్సువాడలో..

బాన్సువాడ విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టిజన్, పీస్ రేట్, అన్‌మ్యాన్‌డ్ కార్మికులు భారీగా ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. తమకు రావాల్సిన వేతనాలు, ఇతర సౌకర్యాలు ఇప్పటికీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వాలని వారు కోరారు. అదేవిధంగా పని భారం తగ్గించడంతో పాటు మ్యాన్‌పవర్ పెంచాలని, పీఆర్‌సీ పెంపు చేయాలని, పీస్ రేట్ విధానాన్ని రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. ధర్నాలో బాన్సువాడ, బిచ్కుంద ఉమ్మడి డివిజన్‌కు చెందిన సుమారు 170 మంది కార్మికులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి సమీ, నాయకులు శివకుమార్, వినోద్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

bans

ఇది కూడా చదవండి..: Banswada Bus Stand Repairs | బాన్సువాడ బస్టాండ్ మరమ్మతులు చేపట్టాలి: ఎమ్మెల్యే పోచారం

School Early Admissions | ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
Farmers Protest Telangana | రైతుహామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
Punjab Sind Bank Branch | బ్యాంకు సేవలను వినియోగించుకోవాలి
Ugadi Celebrations Indur | ఇందూరులో కాషాయ ధ్వజావిష్కరణ.. ఘనంగా ఉగాది ఉత్సవాలు
IVF Services Praised | ఐవీఎఫ్ సేవలు అభినందనీయం: జిల్లా న్యాయసేవల సంస్థ కార్యదర్శి నాగరాణి
TAGGED:artisan employeesBanswada workerselectricity workersKamareddy Newslabor union protestpower department striketelangana protestworkers demands
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Banswada Bus Stand Repairs Banswada Bus Stand Repairs | బాన్సువాడ బస్టాండ్​కు మరమ్మతులు చేపట్టాలి: ఎమ్మెల్యే పోచారం
Next Article Farmers Compensation Farmers Compensation | రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తా: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: IT Expansion | ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించాలి:

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?