Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Elevated Flyover NHAI | ఎలివేటెడ్​ ఫ్లై ఓవర్​ నిర్మాణానికి ఎన్​హెచ్​ఏఐ ఆమోదం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Elevated Flyover NHAI | ఎలివేటెడ్​ ఫ్లై ఓవర్​ నిర్మాణానికి ఎన్​హెచ్​ఏఐ ఆమోదం

తెలంగాణ

Elevated Flyover NHAI | ఎలివేటెడ్​ ఫ్లై ఓవర్​ నిర్మాణానికి ఎన్​హెచ్​ఏఐ ఆమోదం

​బీబీనగర్​ ఎయిమ్స్ వద్ద ఆరు లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఎన్​హెచ్​ఏఐ ఆమోదం తెలిపింది. దీంతో ట్రాఫిక్​ కష్టాలు తీరనున్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 1, 2026 1:11 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
8 గంటలు ago
Share
Elevated Flyover NHAI

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Elevated Flyover NHAI | రాష్ట్రంలో భారీ ఎలివేటెడ్​​ ఫ్లై ఓవర్​ నిర్మాణానికి భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) ఆమోదం తెలిపింది. ఎయిమ్స్​ బీబీనగర్​ (Bibi Nagar) వద్ద ఆరు లేన్ల ఫ్లై ఓవర్​ నిర్మించనుంది.

Contents
  • Elevated Flyover NHAI | 1.70 కిలోమీటర్ల మేర..
    • Elevated Flyover NHAI | మౌలిక సదుపాయాలు

రోడ్డు ప్రమాదాలు (Road Accidents) నివారించడానికి ఎన్​హెచ్​ఏఐ ఈ ఫ్లై ఓవర్​ నిర్మాణం చేపట్టనుంది. NH-163లోని హైదరాబాద్-యాద్గిరి సెక్షన్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు రూ.98.26 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. వైద్య సంస్థ సమీపంలో భద్రతాపరమైన ఆందోళనలు, ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు దీనిని నిర్మించనున్నారు.

Elevated Flyover NHAI | 1.70 కిలోమీటర్ల మేర..

ఈ ఫ్లైఓవర్ 690 మీటర్ల పొడవు ఉంటుందిఎయిమ్స్ ఆసుపత్రి (AIIMS Hospital) సముదాయంలోని ప్రధాన, అత్యవసర గేట్లు రెండింటికీ సమగ్ర కవరేజీని అందించడానికి మొత్తం పరిధి 1.70 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. భువనగిరి, పరిసర ప్రాంతాల నుంచి వచ్చే స్థానిక ప్రయాణికుల కోసం NHAI ఈ రహదారికి ఇరువైపులా 1.48 కిలోమీటర్ల కొత్త సర్వీస్ రోడ్లను నిర్మిస్తుంది. దీంతో ఆస్పత్రికి వెళ్లే ట్రాఫిక్, హై-స్పీడ్ లేన్‌లతో సంబంధం లేకుండా ప్రయాణించడానికి వీలవుతుంది. రోగులు, వైద్య సిబ్బంది, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగుతుంది.

Elevated Flyover NHAI | మౌలిక సదుపాయాలు

వంతెన నిర్మాణంతో పాటు ఇక్కడ రూ.98.26 కోట్లతో వసతులు కల్పించనున్నారు. హైవే లైటింగ్, ట్రాఫిక్ సిగ్నల్స్​ ఏర్పాటు చేయనున్నారు. కొత్త బస్ షెల్టర్లు, రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థలతో కూడిన ప్రత్యేక ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపడుతారు.

ఇది కూడా చదవండి..: Ethanol Blending India | భారత్‌ను ఆదుకుంటోన్న ‘ఇథనాల్’.. ఇప్పటికే రూ. 1.65 లక్షల కోట్లు ఆదా

Musi Project Houses | 10 వేల ఇళ్లు కూల్చేందుకు యత్నం : హరీశ్​రావు
Hydraa Saves Land | రూ.600 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
Fake ice cream | కల్తీ ఐస్​క్రీముల తయారీ.. నిందితుడి అరెస్ట్
Driving License Test | ఆ పరీక్ష పాస్​ అయితేనే డ్రైవింగ్​ లైసెన్స్​
Krishna River Water | చుక్క నీరు కూడా వదులుకోం : మంత్రి ఉత్తమ్​
TAGGED:AIIMS HospitalBB Nagar flyoverBibi NagarElevated Flyover NHAIhighway infrastructureIndia road developmentNH-163 road projectRoad Accidentstraffic safety indiaurban flyover construction
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article PACS Bank Employees Drunk PACS Bank Employees Drunk | సహకార బ్యాంక్​లో మద్యం తాగిన ఉద్యోగులు
Next Article Ration Card Removal Ration Card Removal | రేషన్​కార్డులు తొలగించే కుట్ర.. కవిత సంచలన వ్యాఖ్యలు
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Big TV Resignations | బిగ్​ టీవీలో రాజీనామాల కలకలం

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?