అక్షరటుడే, గాంధారి : EMRS Gandhari Jobs | గాంధారి ఏకలవ్య గురుకులం (Gandhari Ekalavya Gurukulam)లో ఖాళీగా ఉన్న పోస్టులను తాత్కాలిక పద్ధతిలో ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.
EMRS Gandhari Jobs | గాంధారిలో ఈఎంఆర్ఎస్ గురుకులంలో..
మార్చి 26 నుండి వచ్చే ఏప్రిల్ 2 తేదీ వరకు ఒక టీజీటీ హిందీ పోస్టుకు, ఒక సైకాలజీ కౌన్సిలర్ పోస్టుకు, ఎంబీఏ రిటైలర్ పోస్టు, ఇద్దరు మెస్ హెల్పర్ పోస్టులు, ఒక కేటరింగ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దరఖాస్తులను గాంధారిలోని ఈఎంఆర్ఎస్ గురుకులంలో స్వీకరిస్తామన్నారు. వీరి నియామక ప్రక్రియ పూర్తి తాత్కాలికమని, ఈ విద్యా సంవత్సరం కోసం మాత్రమే కొనసాగిస్తామన్నారు. పోస్టుకు తగిన అర్హతలు పాఠశాలలో పొందుపర్చినట్లు పేర్కొన్నారు. జిల్లా స్థానిక బోనోఫైడ్ అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం 9492357892 సంప్రదించాలన్నారు. మెరిట్ ఆధారంగా మాత్రమే నియామకాలు జరుగుతాయన్నారు.
ఇది కూడా చదవండి..: Congress District Secretary | కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా గైక్వాడ్ హన్మంత్

