అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Encroachment Removal Orders | ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా (Hydraa) కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు (Patancheru) మండలంలోని పాటి ఘనపూర్ విలేజ్ ఆనందనగర్ లేఔట్లో రహదారులు, పార్కులతో పాటు ప్రజావసరాలకు కేటాయించిన స్థలాల ఆక్రమణలను పరిశీలించారు. ఆక్రమణాలను తొలగించాలని ఆదేశించారు.
పాటి ఘనపూర్ గ్రామంలో 1980లో 92 ఎకరాల్లో 1,109 ప్లాట్లతో లేఔట్ వేశారు.ఇందులో కొన్ని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ (LRS) కూడా వచ్చింది. ఆనంద్ నగర్ కాలనీ పేరిట ఉన్న లే అవుట్ హద్దులను చెరిపేసి వ్యవసాయ భూమిగా కొందరు చిత్రీకరించారు. అనంతరం కబ్జాకు యత్నించగా.. స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లే అవుట్ ప్రకారం.. పార్కులు, రహదారులు గుర్తించి ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ ఆదేశించారు.
Encroachment Removal Orders | బీరంగూడలో..
అమీన్‌పూర్ మండలం బీరంగూడ (Beeramguda) సర్వే నంబరు 996, 997లో ఉన్న ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందిన లే అవుట్‌ను కొందరు ఆక్రమించారు. 100 గజాల చొప్పున విక్రయిస్తున్నారని సొసైటీ ప్రతినిధులు చేసిన ఫిర్యాదు చేశారు. 180 ఎకరాలలో దాదాపు 1,650 ప్లాట్లతో లే ఔట్ వేసినట్టు రికార్డులు చూపించారు. కొత్తగా ఆక్రమణలు రాకుండా చూడాలని హైడ్రా కమిషనర్ ఆదేశించారు. ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయాలని సూచించారు.
Encroachment Removal Orders | వరద నివారణకు చర్యలు
బీరంగూడలోని శంభుని కుంట ఔట్ లెట్లను రంగనాథ్ పరిశీలించారు. కుంట వరద తమ ప్రాంతాలను ముంచేస్తోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో నాలాను మూసేసి నిర్మాణం జరుపుతున్న సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. వరద కాలువలును పునరుద్ధరించి బాధ్యులపై కేసులు బుక్ చేయాలన్నారు.
దీనిని కూడా చదవండి : RTC Bus Discount | ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఆ బస్సుల్లో 30 శాతం డిస్కౌంట్

