అక్షరటుడే, వెబ్‌డెస్క్: EV Discount Employees | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాలపై (Electric Vehicles) భారీగా డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. ఈ మేరకు విద్యుత్ వాహనాల కంపెనీలతో చర్చలు జరపింది. ఈవీ వెహికిల్స్‌పై 20 శాతం డిస్కౌంట్ ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
హైదరాబాద్ (Hyderabad) నరగంలో పొల్యూషన్ తగ్గించడానికి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకొచ్చిందని మంత్రి పొన్నం తెలిపారు. ఇప్పటికే రోడ్ టాక్స్ , రిజిస్టేషన్ టాక్స్‌ను మినహాయించామన్నారు. దాని ద్వారా దాదాపు వెయ్యి కోట్లు ప్రభుత్వం నష్టపోయిన ఈవీ పాలసీ నీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఈవీ పాలసీతో విద్యుత్ వాహనాల వినియోగం భారీగా పెరిగిందని తెలిపారు.
EV Discount Employees | 10–20 శాతం డిస్కౌంట్
ప్రభుత్వ సంస్థలకు విద్యుత్ వాహనాలు మాత్రమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి తెలిపారు. అన్ని ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. కంపెనీదారులు ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ వాహనాలపై 10-20 శాతం డిస్కౌంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారని వెల్లడించారు. మహీంద్ర ఎలెక్ట్రిక్స్, ఆథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటార్స్, ఓలాతో పాలు పలు కంపెనీలు ముందుకు వచ్చినట్లు చెప్పారు.
EV Discount Employees | బుక్ చేసిన సీఎస్
ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉద్యోగ సంఘాల నాయకులు ఈవీ వాహనాన్ని బుక్ చేసుకున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పథకంతో 5 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు లబ్ధి చేకూరనుంది. కాగా ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో ఈవీ వాహనాలు పెరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: Fake Dentist Arrest | పదో తరగతి పాస్ కాకుండానే డాక్టర్‌గా.. నకిలీ వైద్యుడి అరెస్ట్

