Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Everest Insurance Scam | 30 వేల అడుగుల ఎత్తులో పర్వతారోహకుల ప్రాణాలతో చెలగాటం.. నేపాల్​లో ట్రెక్కింగ్​ ఇన్సూరెన్స్​ కుంభకోణం!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Everest Insurance Scam | 30 వేల అడుగుల ఎత్తులో పర్వతారోహకుల ప్రాణాలతో చెలగాటం.. నేపాల్​లో ట్రెక్కింగ్​ ఇన్సూరెన్స్​ కుంభకోణం!

అంతర్జాతీయంతాజా వార్తలు

Everest Insurance Scam | 30 వేల అడుగుల ఎత్తులో పర్వతారోహకుల ప్రాణాలతో చెలగాటం.. నేపాల్​లో ట్రెక్కింగ్​ ఇన్సూరెన్స్​ కుంభకోణం!

ఈ మోసం వల్ల నిజంగా ప్రాణాపాయంలో ఉన్న ట్రెక్కర్లకు సకాలంలో హెలికాప్టర్ సేవలు అందకపోవడం, నేపాల్ పర్యాటక రంగంపై నమ్మకం దెబ్బతినడం వంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయి.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 3, 2026 9:10 ఉద.
Naresh chandan
17 గంటలు ago
Share
Everest Insurance Scam
Everest Insurance Scam

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Everest Insurance Scam | నేపాల్‌లోని ఎవరెస్ట్ శిఖర ప్రాంతంలో పర్వతారోహకుల ప్రాణాలతో ఆడుకుంటూ సాగుతున్న భారీ ఇన్సూరెన్స్ కుంభకోణం అంతర్జాతీయ సమాజాన్ని నివ్వెరపర్చింది. ఈ భారీ మోసం విషయంలో నేపాల్ ప్రభుత్వం, పోలీసులు (CIB) జరిపిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

Contents
  • Everest Insurance Scam | తక్షణ వైద్య సాయం పేరుతో..
    • Everest Insurance Scam | మోసం ఇలా…
      • ఫేక్​ రెస్క్యూలు:
      • భారీ దోపిడీలో అందరి భాగస్వామ్యం..
      • 32 మందిపై కేసు నమోదు..

Everest Insurance Scam | తక్షణ వైద్య సాయం పేరుతో..

పర్వతారోహకులకు ట్రెక్కింగ్​కు ముందు ఇన్సూరెన్స్​ చేయిస్తారు. అంటే పర్వతం పైకి వెళ్లేటప్పుడు మధ్యలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే తక్షణ వైద్య సాయం అందించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఇలా చేస్తారు. అయితే, ఇక్కడే మోసానికి బీజం పడుతుంది..

Everest Insurance Scam | మోసం ఇలా…

పర్వతారోహకులు పైకి వెళ్తున్నప్పుడు వారికి ఆహారం కింది నుంచే పంపిస్తారు. అయితే, గైడ్‌లు పంపించే ఆహారంలో బేకింగ్ సోడా లేదా ఇతర పదార్థాలను కలిపి ట్రెక్కర్లకు అనారోగ్యం (కడుపు ఉబ్బరం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు) కలిగేలా చేస్తారు. ఇవి పర్వత ప్రాంతాల్లో తరచూ ప్రబలే ‘ఆల్టిట్యూడ్ సిక్నెస్’ లక్షణాలను పోలి ఉంటాయి. దీంతో భయపడిన పర్యాటకులు అత్యవసర హెలికాప్టర్ సహాయాన్ని కోరుతారు.

ఫేక్​ రెస్క్యూలు:

హెలికాప్టర్ ద్వారా ఖాట్మండులోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు పర్యాటకులను తరలిస్తారు. అక్కడ వారికి అవసరం లేకపోయినా పెద్ద మొత్తంలో వైద్య పరీక్షలు నిర్వహించి, భారీగా బిల్లులు వేస్తారు.

భారీ దోపిడీలో అందరి భాగస్వామ్యం..

ఈ మొత్తం ప్రక్రియలో హెలికాప్టర్ కంపెనీలు, ట్రెకింగ్ ఏజెన్సీలు, కొన్ని ఆసుపత్రులు ఒక ముఠాగా ఏర్పడి మోసానికి పాల్పడుతున్నాయని పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి సుమారు 20 మిలియన్ డాలర్ల (దాదాపు ₹165 కోట్లు) మేర క్లెయిమ్‌ల రూపంలో దోచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

32 మందిపై కేసు నమోదు..

ఈ వ్యవహారంపై నేపాల్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (CIB) దర్యాప్తు చేపట్టింది. ఇప్పటి వరకు 32 మందిపై కేసులు నమోదు చేసింది. ఇప్పటికే ట్రెకింగ్ ఏజెంట్లతో సహా పలువురు ఆసుపత్రుల యజమానులను పోలీసులు అరెస్టు చేశారు. 2022 – 25 కాలంలో దాదాపు 300కు పైగా ఇటువంటి నకిలీ రెస్క్యూల ద్వారా ట్రెక్కర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ.. మోసానికి పాల్పడినట్లు విచారణలో గుర్తించారు.

ఇది కూడా చదవండి: Oracle layoffs news | Oracleలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు.. ఉదయం నుంచే లేఆఫ్ ఈ మెయిల్స్!

Global Markets Mixed | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Telangana LPG Supply | రాష్ట్రంలో గ్యాస్‌ కొరత లేదు.. బ్లాక్​ మార్కెట్​ తరలిస్తే కఠిన చర్యలు : మంత్రి ఉత్తమ్​
March 24 Horoscope | పోస్టు ద్వారా అద్భుత సమాచారం.. ఈ రాశుల వారికి ఇక కొండంత సంతోషం!
Saudi Exit Warning | వెంటనే సౌదీని వీడండి.. పౌరులకు అమెరికా విజ్ఞప్తి
Jharkhand Air Ambulance Crash | కూలిపోయిన ఎయిర్​ అంబులెన్స్​.. ఏడుగురు మృతి
TAGGED:Everest Insurance Scam
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article April 03 Gold Rates April 03 Gold Rates | ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. అస్థిరత్వంగా బంగారం ధర!
Next Article Randy George Removal Randy George Removal | ఉద్రిక్తతల మధ్య అమెరికా కీలక నిర్ణయం.. ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ తొల‌గింపు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?