అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Exam Center Facilities | విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆదేశించారు. ఈ మేరకు గురువారం బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో పదో తరగతి పరీక్షకేంద్రాన్ని తనిఖీ చేశారు.
Exam Center Facilities | తరగతి గదుల పరిశీలన
పరీక్ష కేంద్రంలోని (Exam Center) ఆయా తరగతి గదులను సందర్శించారు. పరీక్షల నిర్వహణ సరళిని కలెక్టర్ పరిశీలించారు. విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బందితో ఎవరైనా సెల్ఫోన్లు తెచ్చారా అని ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫోన్లు తేకూడదని.. కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని నిర్వాహకులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, ప్రథమ చికిత్స, ఓఆర్ఎస్ ప్యాకెట్లు (ORS Packets) అందుబాటులో ఉంచాలన్నారు. తరగతి గదిలో తగిన వెంటిలేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Exam Center Facilities | ఒత్తిడికి లోనుకాకుండా చూడాలి..
ఎక్కడా ఎలాంటి చిన్న తప్పిదానికి అవకాశం ఇవ్వకుండా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఎక్కడా కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా.. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరా రికార్డింగ్ నడుమ ప్రశ్నాపత్రాల సీళ్లు తెరిచారా లేదా అని తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ మంగళ ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Village Development | గ్రామాల సమగ్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: గడుగు గంగాధర్
