Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Exam Paper Security | సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్ష పత్రాల బండిళ్లు తెరవాలి: కలెక్టర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Exam Paper Security | సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్ష పత్రాల బండిళ్లు తెరవాలి: కలెక్టర్​

నిజామాబాద్

Exam Paper Security | సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్ష పత్రాల బండిళ్లు తెరవాలి: కలెక్టర్​

సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్ష పత్రాల బండిళ్లు తెరవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలను ఆమె సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 23, 2026 1:38 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 రోజులు ago
Share
Exam Paper Security

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్ ​: Exam Paper Security | సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్ష పత్రాల బండిళ్లు తెరవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలను ఆమె సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Contents
  • Exam Paper Security | నగరంలోని మాణిక్​ భవన్​లో..
    • Exam Paper Security | సీసీ ఫుటేజీల పరిశీలన..
      • Exam Paper Security | అప్రమత్తత అవసరం..

Exam Paper Security | నగరంలోని మాణిక్​ భవన్​లో..

జిల్లా కేంద్రంలోని మాణిక్ భవన్ (Manik Bhavan) పాఠశాలతో పాటు నలంద హైస్కూల్ ఎగ్జామ్ సెంటర్లను కలెక్టర్​ సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్నాపత్రాలను తెరిచారా? అని అడిగి తెలుసుకున్నారు. తప్పనిసరిగా సీసీ కెమెరా రికార్డింగ్ నడుమ ప్రశ్న పత్రాల బండిల్ సీళ్లు తెరవాలని సూచించారు.

Exam Paper Security | సీసీ ఫుటేజీల పరిశీలన..

ఈ మేరకు నిబంధనలు పాటించారా లేదా అని సీసీ ఫుటేజీల పరిశీలన ద్వారా కలెక్టర్​ నిర్ధారణ చేసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ఆరోగ్య కార్యకర్త అందుబాటులో ఉన్నారా లేదా అని గమనించారు. ఎగ్జామ్ హాల్​లోకి సిబ్బంది ఎవరైనా సెల్​ఫోన్లతో వచ్చారా అని కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు. ఎక్కడ కూడా కాపీయింగ్​కు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కాపీయింగ్ కు ఆస్కారం కల్పిస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు.

Exam Paper Security | అప్రమత్తత అవసరం..

పరీక్షలు ముగిసేంత వరకు అప్రమత్తతతో పకడ్బందీగా విధులు నిర్వహించాలని కలెక్టర్​ సూచించారు. ప్రశ్నాపత్రాలను తప్పనిసరిగా తగిన పోలీసు బందోబస్తు మధ్య కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు జె.శంకర్, టి.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: SSC Exam Rules | ఎస్​ఎస్​సీ పేపర్​ లీకేజీ వ్యవహారం.. పర్యవేక్షణ మరింత కఠినతరం!

Government Hospital Punctuality | ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది సమయపాలన పాటించాలి : డీఎంహెచ్​వో
Kamareddy Girls Missing | బాలసదనం నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం.. కామారెడ్డిలో ఘటన
BJP Collectorate Protest | ప్రభుత్వ హామీలపై నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కలెక్టరేట్​ను ముట్టడిస్తాం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
Nizamabad Budget Bias | బడ్జెట్​లో ఇందూరుపై కాంగ్రెస్​ సర్కారు వివక్ష: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
Sriramsagar Hydel Power | జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
TAGGED:Anti Copying Measuresboard exams indiaCCTV in examseducation newsExam Paper Securityexam rulesNizamabad Newsschool exams India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Pakistan Fuel Crisis Pakistan Fuel Crisis | పాకిస్థాన్​లో ఇంధన సంక్షోభం.. భారీగా పెరిగిన ధరలు
Next Article Rythu Bharosa Issue Rythu Bharosa Issue | ఎన్ని ఎకరాల భూమి ఉన్నా.. ఒక్క ఎకరాకే రైతు భరోసా జమ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?