Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Extramarital Affair Murder | ఇద్దరితో అక్రమ బంధం.. ఒకడి సహకారంతో మరొకడిని కడతేర్చిన మహిళ!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Extramarital Affair Murder | ఇద్దరితో అక్రమ బంధం.. ఒకడి సహకారంతో మరొకడిని కడతేర్చిన మహిళ!

నిజామాబాద్

Extramarital Affair Murder | ఇద్దరితో అక్రమ బంధం.. ఒకడి సహకారంతో మరొకడిని కడతేర్చిన మహిళ!

కామారెడ్డి జిల్లాలో వింత కేసు వెలుగు చూసింది. ఓ మహిళ ఇద్దరు యువకులతో అక్రమ సంబంధం కలిగి ఉంది.. కాగా వారిలో ఒకరితో బంధం చెడటంతో.. మరో ప్రియుడితో అతగాడిని కడతేర్చింది.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 7, 2026 10:41 సా.
Naresh chandan
1 రోజు ago
Share
Extramarital Affair Murder
Extramarital Affair Murder

అక్షరటుడే, కామారెడ్డి: Extramarital Affair Murder | వివాహేతర సంబంధాలు నిండు జీవితాలను బలి చేస్తున్నాయి. అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నారని భర్తల పాలిట కట్టుకున్న భార్యలు.. భార్యల పాలిట భర్తలు యమకింకరులుగా మారుతున్నారు. ప్రియుడి సహకారంతో దారుణ హత్యలకు పాల్పడుతున్నారు.

Contents
  • Extramarital Affair Murder | ఇద్దరితోనూ..
    • Extramarital Affair Murder | మద్యం తాగుదామని నమ్మించి..

కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం ఉగ్రవాయి, రాఘవాపూర్ శివారులో ఈ నెల 3 న గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైన ఘటన వెలుగు చూసింది. ఉగ్రవాయి గ్రామ జీపీవో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల విచారణలో వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేలింది. ఈ మేరకు మంగళవారం (ఏప్రిల్​ 07) రాత్రి సబ్ డివిజన్ కార్యాలయంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు.

Extramarital Affair Murder | ఇద్దరితోనూ..

ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూరు మండలం కాచాపుర్ గ్రామానికి చెందిన పాలమాకుల శ్రీనివాస్ గౌడ్ అనే ఆటో డ్రైవర్‌కు అదే గ్రామానికి చెందిన తొగరి భాగ్యలక్ష్మి అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఇదే మహిళతో మృతుడు శివశంకర్​కి కూడా అక్రమ బంధం ఏర్పడింది.

అయితే, భాగ్యలక్ష్మికి శివశంకర్​తో ఎక్కడ చెడిందో కానీ, శ్రీనివాస్​ గౌడ్​తో కలిసి అతడిని చంపేందుకు ప్రణాళిక రచించింది. ఈ క్రమంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం.. శ్రీనివాస్ గౌడ్, తోగరి భాగ్యలక్ష్మి కలిసి ఈ నెల 2 న శివశంకర్‌కు మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకెళ్లారు.

Extramarital Affair Murder | మద్యం తాగుదామని నమ్మించి..

ఉగ్రవాయి గ్రామ శివారులోని రాఘవేంద్ర రైస్ మిల్ సమీప ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగుదామని నమ్మించి.. అదును చూసి శివశంకర్​పై దాడి చేశారు. కత్తితో కడుపులో పలు మార్లు పొడిచి దారుణంగా హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి అక్కడి నుంచి పరారయ్యారు.

సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారం ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. సరంపల్లి క్రాస్ రోడ్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, ఆటో, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్​కు తరలించారు.

Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు
Sai Baba Temple Bhakti | సాయిసన్నిధిలో ఆధ్యాత్మిక శోభ.. భక్తిశ్రద్ధలతో పల్లకీసేవ
Armoor Peace Rally | ఆర్మూర్​లో ఘనంగా శాంతి ర్యాలీ
Sudarshan Reddy Polytechnic Initiative | పాలిటెక్నిక్ కళాశాలలను సద్వినియోగం చేసుకోవాలి: ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి
Mohan Reddy Funeral | పాడే మోసిన షబ్బీర్ అలీ.. ముగిసిన మాజీ జడ్పీటీసీ అంత్యక్రియలు
TAGGED:Extramarital Affair Murder
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Nizamabad Power Supply | Nizamabad Power Supply | మెరుగైన విద్యుత్తు సరఫరాకు కృషి : ట్రాన్స్​కో గ్రిడ్​ అండ్​ ట్రాన్స్​మిషన్​ డైరెక్టర్​ సంపత్ రావు
Next Article H1B Visa Changes | H-1B లాటరీ విధానం రద్దు.. ఇకపై వేతన ఆధారంగానే! H1B Visa Changes | H-1B లాటరీ విధానం రద్దు.. ఇకపై వేతన ఆధారంగానే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?