అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Eye Care Awareness | నేత్ర సమస్యలను (eye care) అశ్రద్ధ చేయకూడదని, శరీర అవయవాలలో అత్యంత ప్రధానమైన కంటి చూపును (vision health) ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో బోర్గాం(పి) ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ద్వారా విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి బాలబాలికలకు కంటి అద్దాలు అందజేశారు.
Eye Care Awareness | కంటిచూపు మందగించకుండా..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కంటి చూపు మందగించకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఆకు కూరలు, క్యారెట్ వంటి వాటిని ఆహార పదార్థాల్లో (eye checkup) భాగం చేసుకోవాలని సూచించారు. ఇదివరకు తాను కూడా దృష్టి లోపంతో ఇబ్బందిపడ్డానని, తగిన వ్యాయామాలు, సరైన ఆహారపు అలవాట్లతో ఆ సమస్యను అధిగమించానని కలెక్టర్ వెల్లడించారు. కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న (student health) వారిని గుర్తించేందుకు వీలుగా జిల్లాలో సుమారు 70 వేల మంది వరకు విద్యార్థులకు నేత్ర పరీక్షలు (free eye camps) చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పటికే 41వేల మందికి కంటి పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు. ఇందులో భాగంగానే అవసరమైన వారికి అంధత్వ నివారణ సంస్థ ద్వారా ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేత్ర పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
Eye Care Awareness | క్రమతప్పకుండా కళ్లద్దాలు వాడాలి..
చూపు మందగించిన వారు రెగ్యులర్‌గా కంటి అద్దాలను వినియోగిస్తూ సరైన పోషక ఆహారం తీసుకుంటే దృష్టి లోపం (eye protection) సమస్య నుండి బయటపడవచ్చని కలెక్టర్ తెలిపారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు (public health) ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుత వేసవి సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని శరీరం డీహైడ్రేట్ కాకుండా నీళ్లు బాగా తాగాలన్నారు. ఈ సందర్భంగా కంటి సంబంధిత సమస్యలకు సంబంధించిన అంశాలపై విద్యార్థులకు పలు ప్రశ్నలు వేస్తూ, సరైన సమాధానాలు చెప్పిన వారికి కలెక్టర్ బహుమతులు అందజేశారు.
క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా..
క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో (TB Free India Campaign) భాగస్వాములం అవుతామని విద్యార్థులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాజశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్‌వో అశ్విని, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ పీవో డాక్టర్ సుజాత, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజ్మల్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్, ఉపాధ్యాయులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Rudrur Road Accident | రుద్రూర్ శివారులో రోడ్డు ప్రమాదం.. 45 మందికి గాయాలు

