అక్షరటుడే, వెబ్‌డెస్క్: Eye wear | నేటి కాలంలో కళ్లద్దాలు జీవనశైలిలో భాగమైపోయాయి. అయితే వాటిని వాడటంలో చూపించే శ్రద్ధ, శుభ్రం చేసే విషయంలో చాలామంది చూపించరు. చేతికి ఏది దొరికితే ఆ క్లాత్‌తో అద్దాలను తుడిచేస్తుంటారు.
కానీ, ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలు కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లెన్సులు ఎక్కువ కాలం మన్నాలన్నా.. కళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
Eye wear | లెన్సుల శుభ్రతలో ఈ జాగ్రత్తలు పాటించండి.
సరైన క్లాత్: వేసుకున్న దుస్తులు, కర్చీఫ్ లేదా స్కార్ఫ్‌లతో అద్దాలను తుడవడం వల్ల వాటిపై సన్నటి గీతలు పడతాయి. కేవలం కళ్లద్దాలతో పాటు వచ్చే మైక్రోఫైబర్ క్లాత్‌ను మాత్రమే వాడాలి. రోజుకు ఒక్కసారైనా నీటితో కడిగి తుడిస్తే దుమ్ము, జిడ్డు వదులుతాయి.
కెమికల్స్ వద్దు: సబ్బు నీళ్లు లేదా డిష్ వాషింగ్ లిక్విడ్స్‌తో అద్దాలను తోమడం వల్ల లెన్సులపై ఉండే యాంటీ-గ్లేర్, యూవీ ప్రొటెక్షన్ కోటింగ్ దెబ్బతింటుంది. ఇది కంటికి హాని కలిగిస్తుంది.
Eye wear | భద్రపరచడం ముఖ్యం:
అద్దాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఎప్పుడూ వాటి కేసు (Box) లోనే ఉంచాలి. బ్యాగుల్లో వేసినా, పక్కన పెట్టినా లెన్సులు పైకి ఉండేలా చూసుకోవాలి. లేదంటే నేరుగా లెన్సులపై గీతలు పడతాయి.
ఎండకు దూరంగా: అద్దాలను నేరుగా సూర్యరశ్మి తగిలే చోట ఉంచకూడదు. ఎండ తీవ్రత వల్ల లెన్సుల నాణ్యత దెబ్బతింటుంది. అలాగే పెర్ఫ్యూమ్స్, హెయిర్ స్ప్రేలు అద్దాలపై పడకుండా జాగ్రత్త పడాలి.
వాడే పద్ధతి: అద్దాలను ఒక చేత్తో తీయడం లేదా పెట్టుకోవడం స్టైల్‌గా అనిపించినా.. అది ఫ్రేమ్ ఆకృతిని దెబ్బతీస్తుంది. కాబట్టి ఎప్పుడూ రెండు చేతులతోనే అద్దాలను హ్యాండిల్ చేయడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: Multiple Bank Accounts | ఒకే బ్యాంకులో రెండు, మూడు అకౌంట్లు ఉండొచ్చా.. ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా.. నష్టమా?
