Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Face Recognition Schemes | ఇకపై అన్ని పథకాలు ఫేస్ రికగ్నిషన్‌తోనే.. రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Face Recognition Schemes | ఇకపై అన్ని పథకాలు ఫేస్ రికగ్నిషన్‌తోనే.. రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం

తెలంగాణతాజా వార్తలు

Face Recognition Schemes | ఇకపై అన్ని పథకాలు ఫేస్ రికగ్నిషన్‌తోనే.. రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం

సంక్షేమ పథకాల అమలులో అవకతవకలను అరికట్టడమే లక్ష్యంగా ఫేస్ రికగ్నిషన్ విధానం నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Naresh chandan
Last updated: మార్చి 3, 2026 11:01 సా.
Naresh chandan
3 వారాలు ago
Share
Face Recognition Schemes
Face Recognition Schemes

అక్షరటుడే, హైదరాబాద్‌: Face Recognition Schemes | సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతను పెంచే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ పథకాలను ఫేస్ రికగ్నిషన్ విధానానికి అనుసంధానం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Contents
  • Face Recognition Schemes | అన్ని పథకాలకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి
    • Face Recognition Schemes | పారదర్శకత – లక్ష్యంగా ప్రభుత్వం
      • Face Recognition Schemes | కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు
      • అమలు విధానం
      • ప్రజల్లో చర్చ

Face Recognition Schemes | అన్ని పథకాలకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్, పెన్షన్లు Pension , విద్య, రైతు, మహిళా సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల గుర్తింపును ఫేస్ రికగ్నిషన్​తో ధ్రువీకరించాలనే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ విధానం ద్వారా నకిలీలు, రెండుసార్లు నమోదు, మోసపూరిత వినియోగం వంటివి అరికట్టవచ్చని సర్కారు భావిస్తోంది.

Face Recognition Schemes | పారదర్శకత – లక్ష్యంగా ప్రభుత్వం

ప్రస్తుతం ఆధార్ ఆధారంగా ధ్రువీకరణ కొనసాగుతోంది. కానీ, మరింత కచ్చితత్వం కోసం ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించాలని సర్కారు నిర్ణయించింది. ఈ విధానం అమల్లోకి వస్తే.. లబ్ధిదారులు ప్రత్యక్షంగా ముఖ గుర్తింపును నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. తద్వారా మధ్యవర్తుల జోక్యం తగ్గుతుంది. అర్హులకు మాత్రమే ప్రయోజనాలు కలుగుతాయి.

Face Recognition Schemes | కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు

జిల్లా స్థాయిలో అవసరమైన టెక్నాలజీ సౌకర్యాలు, పరికరాలు, సిబ్బందికి శిక్షణ వంటి అంశాలకు కావల్సిన ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లకు సూచించినట్లు సమాచారం. గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

అమలు విధానం

మొదట కొన్ని పథకాలు ఎంపిక చేసి, పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తారు. విజయవంతం అయితే  దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించనున్నారు.

ప్రజల్లో చర్చ

సర్కారు నిర్ణయంపై ప్రజల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. పారదర్శకతకు ఈ విధానం దోహదం చేస్తుందని కొందరు చెబుతుండగా.. మరోవైపు సాంకేతిక లోపాలు, వృద్ధులు, కార్మిక వర్గాలకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Telangana Public Schools | రవాణాలో 50 శాతం రాయితీ.. బోర్డుల విలీనం.. విద్యావిధానంపై సీఎం కీలక నిర్ణయాలు!
Maoists Surrender Telangana | లొంగిపోనున్న మావోయిస్ట్​ అగ్రనేత గణపతి!
Iran Israel War UPDATES | మోజ్తాబా ఎన్నిక.. ఇరాన్​ యుద్ధంపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
Digital Health Cards | ఉద్యోగులకు డిజిటల్​ హెల్త్​ కార్డులు
Food Adulteration Raids | కుళ్లిన గుడ్లతో కేక్​ల తయారీ.. బేకరీపై పోలీసుల దాడులు
TAGGED:Aadhaar AuthenticationBiometric VerificationDigital Governance IndiaFace Recognition SystemPublic Distribution SystemRevanth Reddy DecisionTelangana GovernmentWelfare Schemes Telangana
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article US Israel Iran Conflict US Israel Iran Conflict | అమెరికా – ఇజ్రాయెల్​ దాడులు.. నాలుగో రోజూ కొనసాగుతున్న ఉద్రిక్తత!
Next Article Hyderabad Land Allotment Hyderabad Land Allotment | ఎంపీ మల్లు రవి భార్యకు రూ.8 కోట్లు విలువ చేసే భూమి ధారాదత్తం!
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?