అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Fake Dentist Arrest | హైదరాబాద్ నగరంలో నకిలీ డాక్టర్లు భారీగా ఉన్నారు. దొంగ సర్టిఫికెట్లతో (Fake Certificates) పలువురు వైద్యులుగా చెలామణి అవుతున్నారు. తమకు తోచిన వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
నగరంలోని నేరేడ్‌మెట్‌లో నకిలీ డెంటల్ డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రమేశ్ అనే వ్యక్తి 20 ఏళ్ళుగా క్లినిక్ పెట్టి డెంటల్ వైద్యం చేస్తున్నాడు. అనుమానం రావడంతో పోలీసులు మంగళవారం క్లినిక్‌లో తనిఖీలు చేపట్టారు. నకిలీ వైద్యుడిగా గుర్తింంచి అదుపులోకి తీసుకున్నారు.
Fake Dentist Arrest | రాత్రి పూట వైద్యం
యూపీకి చెందిన రమేష్ హైదరాబాద్ (Hyderabad)కు వలస వచ్చాడు. ఇక్కడ దంత వైద్యుడి అవతారం ఎత్తి రోగులకు చికిత్స సైతం చేస్తున్నాడు. అయితే అతడు పదో తరగతి కూడా చదవకపోవడం గమనార్హం. రాత్రి నుంచి ఉదయం వరకు మాత్రమే రమేష్ వైద్యం చేస్తున్నాడు. అతడిపై అనుమానం రావడంతో ఎస్వోటీ పోలీసులు సోదాలు చేశారు. ఫేక్ డాక్టర్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాజ్‌గిరి పోలీసులు (Malkajgiri Police) తెలిపారు.ఓ వ్యక్తి ఎలాంటి అర్హత లేకుండా నగరంలో 20 ఏళ్ల పాటు క్లినిక్ నిర్వహించడం గమనార్హం. ఇన్ని రోజులుగా అతడు ఎంతో మందికి వైద్యం చేశాడు. అయినా ఎవరికి అనుమానం రాకుండా చూసుకున్నాడు. ఇలాంటి వారు నగరంలో చాలా మంది ఉంటారని ప్రజలు అంటున్నారు. తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Water wars warning | నీటి యుద్ధాలు రాకముందే మేల్కొందాం : హైడ్రా కమిషనర్

