అక్షరటుడే, కామారెడ్డి: Fake Land Documents | ఫేక్ డాక్యుమెంట్లు (Fake Documents) సృష్టించి తనభూమి కబ్జా చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి (Kamareddy) పట్టణానికి చెందిన విజయ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.
Fake Land Documents | కామారెడ్డి పట్టణంలో..
బాధితుడు మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణంలోని సైలానీబాబా కాలనీ (Sailanibaba Colony)లో 888 సర్వే నంబర్లో తనకు 7 గుంటల భూమి ఉందన్నారు. అయితే ముత్యంపేట గోపి గౌడ్ అనే వ్యక్తి తన భూమిని గతంలో విక్రయించాడని తెలిపారు. ప్రస్తుతం తనకు సంబంధించిన 888 సర్వే నంబరుపై బై నంబర్లు సృష్టించి వాటి ద్వారా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి అతని వదిన, కొడుకు, ఇతరుల పేరున భూమి సేల్ డీడ్ చేశాడని ఆరోపించారు. తన భూమికి సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు. ఆ స్థలాన్ని కబ్జా చేసి అందులో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణం చేయడానికి దరఖాస్తు చేసుకున్నాడన్నారు. తన భూమిపై ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.
ఇది కూడా చదవండి..: LPG Cylinders Seized | కామారెడ్డిలో 31 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం

