అక్షరటుడే, కామారెడ్డి: Fake Number Plate | పోలీసుల చలాన్ల నుంచి (Fake number plate case) తప్పించుకోవడానికి వాహనదారులు అనేక విన్యాసాలు చేస్తుంటారు. నంబర్ ప్లేట్ మార్చడమో.. నంబర్ కనిపించకుండా దుస్తులు కప్పడం లాంటివి చేస్తుంటారు. ఇలాగే నంబర్ ప్లేట్ (traffic challan evasion) కనపడకుండా చెట్ల కొమ్మలు అడ్డుపెట్టి నడుపుతున్న డీసీఎం వ్యానును మంగళవారం భిక్కనూరు (Bhikkanoor toll plaza) పోలీసులు పట్టుకున్నారు.
Fake Number Plate | భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో భిక్కనూరు పోలీసులు టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పెట్రో కార్ డ్యూటీలో (Kamareddy police news) ఉన్న హెడ్ కానిస్టేబుల్ మలావత్ అంబర్ సింగ్, ఇతర సిబ్బంది ఒక డీసీఎం వాహనం నంబర్ ప్లేట్‌ను చెట్ల ఆకులు, కొమ్మలతో కప్పి హైదరాబాద్ నుండి కామారెడ్డి వైపు వెళ్తుండగా గమనించారు. అనుమానం వచ్చి ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా వాహనంపై TS 21 UD 4521 నంబర్ ప్లేట్ ఉంది. పోలీసుల ట్యాబ్ ద్వారా చెక్ చేయగా ఆ నంబర్‌కు సంబంధించిన ఎటువంటి వాహన వివరాలు కనిపించలేదు. దాంతో డ్రైవర్‌ను వాహనానికి సంబంధించిన ఆర్‌సీ పత్రాలు చూపించాలని అడిగారు. ఆర్‌సీ పత్రాలలో వాహనం అసలు నంబర్ TS 12 UD 4521 ఉండటంతో ప్లేటు ఎందుకు మార్చారని పోలీసులు డ్రైవర్ ను ప్రశ్నించారు.
Fake Number Plate | చలాన్లను తప్పించుకునేందుకు..
వాహన చలాన్ల నుండి తప్పించుకోవడానికి ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్‌లోని అంకెలను మార్చి వాహనం నడుపుతున్నానని డ్రైవర్ (Telangana crime news) అంగీకరించాడు. డీసీఎం డ్రైవర్ బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన గౌస్ పాషాగా గుర్తించారు. ఈ ఘటనపై హెడ్ కానిస్టేబుల్ మలావత్ అంబర్ సింగ్ ఫిర్యాదు మేరకు భిక్కనూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: BJP councillors protest | మున్సిపల్ కమిషనర్‌పై బీజేపీ కౌన్సిలర్ల ఫైర్..

