అక్షరటుడే, వెబ్డెస్క్ : Family Life Insurance Scheme | రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టనుంది. ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా అమలు చేస్తామని ప్రకటించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రైతు బీమా అమలులో ఉంది. బీమా ఉన్న రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందుతోంది. దీంతో పాటు పలు రంగాలకు చెందిన కార్మికులకు వేర్వేరు బీమా పథకాలు ఉన్నాయి. అయితే తాజాగా డిప్యూటీ సీఎం అసెంబ్లీ (Assembly)లో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భద్రత కల్పించడానికి కొత్త పథకం ప్రవేశ పెట్టనున్నట్లు చెప్పారు. కుటుంబ పెద్ద అకస్మత్తుగా చనిపోతే.. ఆ కుటుంబానికి అండగా ఉండేలా జీవిత బీమా పథకానికి శ్రీకారం చుడుతున్నట్ల ప్రకటించారు. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా.. పేద, మధ్య, తరగతి, ధనిక అనే తేడాలు లేకుండా రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకం అమలు చేస్తామన్నారు.

Family Life Insurance Scheme | ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేరిట రూ.5 లక్షలు అందిస్తామని తెలిపారు. ఈ పథకాన్ని జూన్ 2న ప్రారంభిస్తామని తెలిపారు. కాగా ప్రస్తుతం ఉన్న రైతు బీమా, ఇతర పథకాలను ప్రభుత్వం కొనసాగిస్తుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ పథకం మార్గదర్శకాలు వచ్చాక.. ఎవరు అర్హులు అనేది తెలియనుంది.
Family Life Insurance Scheme | 67 వేల మందికి ఉద్యోగాలు
రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకక 67 వేల మందికి నియామక పత్రాలు అందించామన్నారు. సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశామని తెలిపారు. ఇందులో 51 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని చెప్పారు. వారిలో 20 మంది ఉద్యోగాలు సాధించారన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Budget 2026 | రూ.3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్

