అక్షరటుడే, వెబ్డెస్క్: Farmer Welfare Programs | రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) అన్నారు. అన్నదాతల ముఖాల్లో చిరునవ్వు చూడటమే అసలైన విజయం అని పేర్కొన్నారు.
నల్లగొండ మండలం (Nalgonda Mandal) జి. చెన్నారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. రైతులు పంటను అమ్ముకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి గింజకు మద్దతు ధర కల్పించడంతో పాటు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు చేపడుతామన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం తూకం నుంచి నగదు జమ వరకు ప్రతి ప్రక్రియ వేగంగా జరిగేలా చూడాలన్నారు.
Farmer Welfare Programs | పేదలకు మెరుగైన వైద్యం
నల్లగొండ జిల్లా మాన్యంచల్క (Manyamchalka)లో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను వారి నివాస ప్రాంతాలకు సమీపంలోనే అందుబాటులోకి తీసుకురావడం తమ లక్ష్యమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి..: Illegal Water Motors | నల్లాకు మోటార్ పెడుతున్నారా.. జలమండలి కఠిన చర్యలు
