అక్షరటుడే, కామారెడ్డి: Farmers Protest Telangana | రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు చెలిమెల భానుప్రసాద్ అన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం కలెక్టరేట్ (Collectorate) వద్ద ధర్నా నిర్వహించారు.
Farmers Protest Telangana | సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు..
కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భానుప్రసాద్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు పెట్టుబడి భరోసా ఉన్న రూ.10 వేలను రూ.15 వేలు చేసి ఇస్తామని రెండు విడతలు ఇచ్చి మూడో విడత ఎగ్గొట్టారన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. సరిపడా యూరియా (Urea) అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
Farmers Protest Telangana | రైతులపై కేసులా..?
ఇవన్నీ అడిగిన రైతులపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని భానుప్రసాద్ అన్నారు. వెంటనే రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా (Rythu Bharosa) ఇచ్చామని కానీ అవి ఎక్కడికి పోయాయో తెలియవని సీఎం మాట్లాడడం చెప్పడం బాధ్యతారాహిత్యమన్నారు. రైతుల జోలికి వస్తే బీఆర్ఎస్ ఊరుకోదని, రైతుల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమానికి వచ్చే అధికారులు, నాయకులు మంత్రులను రైతులు నిలదీయాలన్నారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఇది కూడా చదవండి..: Water Tank Inspection | వాటర్ ట్యాంక్ ఎక్కిన కలెక్టర్.. పరిశుభ్రత కార్యక్రమం పరిశీలన

