అక్షరటుడే, నిజామాబాద్‌సిటీ: Farmers Trade Deal Issue | దేశరైతులకు అన్యాయం చేస్తూ కేంద్రం విదేశాలతో ఒప్పందాలు (Agriculture Policy) కుదుర్చుకుంటోందని డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి (Nagesh Reddy) అన్నారు. జాతీయ యువజన కాంగ్రెస్ (National Youth Congress) ఆదేశాల మేరకు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో సత్యాగ్రహ దీక్ష చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షుడు హాజరైన మాట్లడారు.
Farmers Trade Deal Issue | నల్లచట్టాలతో రైతుల పొట్టగొడుతున్నారు..
ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ దేశ రైతులకు అన్యాయం చేసే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో అమెరికా (America) వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే ఒప్పందం చేసుకుందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లచట్టాలను తెచ్చేందుకు ప్రయత్నించిందన్నారు. వాటికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ రైతులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమాలు చేయడం ద్వారా వెనక్కి తీసుకుందన్నారు. మరొకసారి రైతులకు అన్యాయం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం యూఎస్‌తో ట్రేడ్‌డీల్ కుదుర్చుకుందని విమర్శించారు. దీంతో భారతదేశంలో ఉన్న రైతుల ఉత్పత్తులకు మద్దతు ధర తగ్గిపోతుందన్నారు.
Farmers Trade Deal Issue | రైతుల ఉత్పత్తులకు గండి..
అమెరికా నుంచి తక్కువ ధరకు ఉత్పత్తులు వస్తే దేశ రైతుల ఉత్పత్తులను ఎవరూ కొనుగోలు చేయరని.. తద్వారా రైతులకు మద్దతు ధర రావడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నగేష్ రెడ్డి అన్నారు. రైతులు ఆర్థిక సంక్షోభానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్రంలో వర్షాల వల్ల వడ్లు రాలిపోయి రైతులు నష్టపోయారని కలెక్టర్ వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారన్నారు. కానీ వర్షం పడ్డ మరుసటి రోజే అధికారులు వెళ్లి నష్టపోయిన పంటను వివరాలు తెలుసుకున్న విషయం వారికి తెలియదన్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు కొంత సమయం పడుతుందన్నారు.
ఇకనైనా బీజేపీ నాయకులు కేంద్రంలో దేశ రైతులకు చేస్తున్న అన్యాయాలపై మాట్లాడాలని.. కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు వెంటనే యూఎస్‌తో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ రద్దుచేసి దేశ రైతులకు లాభం చేసే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, పీసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు జీవీ రామకృష్ణ, డీసీసీ ఉపాధ్యక్షుడు కౌడపు శరత్ కుమార్, గాదరి గోపి, డీసీసీ ట్రెజరీ భక్తవత్సలం, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
