అక్షరటుడే, కామారెడ్డి: Fee Reimbursement Funds | వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఫీజు బకాయిల కోసం రూ.15వేలు కోట్లు కేటాయించాలని బీసీ విద్యార్థి సంఘం ( bc students association) జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Fee Reimbursement Funds | రెండేళ్ల ప్రభుత్వ నిధులపై..
రెండేళ్ల ప్రభుత్వ నిధుల విడుదలపై శ్వేతపత్రం (telangana education funding) విడుదల చేయాలని నీల నాగరాజు అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని (student fee reimbursement) నీరుగారిస్తే ప్రభుత్వ పీఠం కదిలిస్తామని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, ఈ బడ్జెట్లో (telangana budget demand) ఫీజులకు రూ.పదివేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌తో ఈనెల 15వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ (student protest hyderabad) వద్ద ‘ఫీజు పోరు’ దీక్ష చేపడుతున్నామని తెలిపారు. అధికారంలోకి రాగానే ఫీజుల బకాయిలను విడుదల చేస్తామని, బీసీ విద్యార్థుల పూర్తి ఫీజులను చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. రూ.ఐదు లక్షలతో ప్రతి విద్యార్థికి విద్యార్థి భరోసా కార్డులను అందజేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా నేటి వరకు అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరమన్నారు.
Fee Reimbursement Funds | రాష్ట్ర ప్రభుత్వానివి అబద్ధపు మాటలు..
గత రెండేళ్ల కాలంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు ఫీజుల రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని రాష్ట్రమంతా విద్యార్థులంతా ఉద్యమిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ ఉందని అబద్ధపు మాటలు (education policy telangana) చెబుతుందని నాగరాజు మండిపడ్డారు. రూ. ఏడు వేల కోట్లు ఫీజుల బకాయిలు ఇవ్వలేని ప్రభుత్వం గత రెండేళ్లు బడా కాంట్రాక్టర్లకు రూ.70వేల కోట్లు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ఫీజులు ఇవ్వలేని ప్రభుత్వం ఒక వైపు రూ.5 వేల కోట్లతో గాంధీ విగ్రహం పెడుతున్నారని, 22 లక్షల పేద విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ముఖ్యం..
విద్యార్థులకు కావాల్సింది స్కూటీలు, ఎంగిలి మెతుకులు కాదని, ఆత్మగౌరవంతో చదువుకోవడానికి ఫీజుల రీయింబర్స్మెంట్ కావాలన్నారు. బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల ఇప్పటివరకు రాష్ట్రంలో 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరిగే ఫీజు పోరు దీక్షలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సాయి విగ్నేష్, రాజ్ కుమార్, మనిరాజ్, సుమన్, గణేష్, శివ, నిఖిల్, సందీప్, వరుణ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Modi Congress Criticism | విదేశీ శక్తుల చేతుల్లో కాంగ్రెస్.. ప్రధాని మోదీ విమర్శలు

