Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Feeding Centers | బాలింతలకు గుడ్​న్యూస్​.. బస్టాండ్​లలో ఫీడింగ్​ సెంటర్లు ప్రారంభం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Feeding Centers | బాలింతలకు గుడ్​న్యూస్​.. బస్టాండ్​లలో ఫీడింగ్​ సెంటర్లు ప్రారంభం

తెలంగాణ

Feeding Centers | బాలింతలకు గుడ్​న్యూస్​.. బస్టాండ్​లలో ఫీడింగ్​ సెంటర్లు ప్రారంభం

బస్టాండ్​లలో ఫీడింగ్​ సెంటర్లను మంత్రులు దామోదర్​ రాజనర్సింహ, సీతక్క ప్రారంభించారు. ఆదివాసీ భవన్​లో నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 8, 2026 2:54 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Feeding Centers

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Feeding Centers | మహిళలకు అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో రాణిస్తారని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) అన్నారు. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే సమాజమే నిజమైన అభివృద్ధి చెందిన సమాజం అని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్‌లోని ఆదివాసీ భవన్‌లో ఆదివారం వేడుకలు నిర్వహించారు. మంత్రి సీతక్కతో కలిసి ఆయన పాల్గొన్నారు.

Contents
  • Feeding Centers | దేశాభివృద్ధికి పునాది
    • Feeding Centers | ఆరోగ్య పరీక్షలు
      • Feeding Centers | హెచ్​పీవీ వ్యాక్సినేషన్​

ఆదివాసీ భవన్‌ (Adivasi Bhavan)లో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ (HPV Vaccination), ఫీడింగ్ కియోస్క్ స్టాళ్లను మంత్రులు ప్రారంభించారు. ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతాల్లో ఉండే మహిళల భద్రత, వసతి కోసం ప్రత్యేకంగా రూపొందించిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా సంఘాల సభ్యులను వారు సన్మానించారు. కాగా బాలింతలు బయటకు వచ్చిన సమయంలో చిన్నారులకు పాలు పట్టడానికి అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్, మేడ్చెల్, రంగారెడ్డి జిల్లాల్లో 10 ప్రాంతాల్లోని బస్టాండ్​లలో ఫీడింగ్ కియోస్క్​ సెంటర్లను ప్రారంభించారు. బాలింతలు వీటిలో తమ పిల్లలకు పాలు ఇవ్వొచ్చు.

Feeding Centers | దేశాభివృద్ధికి పునాది

మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. మహిళా సాధికారత నినాదం కాదని, అది దేశ అభివృద్ధికి పునాది అన్నారు. ఈ లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. తమ ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

Feeding Centers | ఆరోగ్య పరీక్షలు

డ్వాక్రా మహిళల కోసం ఉచిత హెల్త్ స్క్రీనింగ్ (Health Screening) కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్రంలోని 4.37 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 46 లక్షల మంది మహిళలకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేస్తామని మంత్రి వెల్లడించారు. సెర్ప్​ సిబ్బంది సహకారంతో మహిళలకు బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి 30 రకాల కీలక పరీక్షలు ఉచితంగా చేయిస్తున్నట్లు తెలిపారు. పరీక్షల అనంతరం మహిళల డిజిటల్ హెల్త్ రికార్డు తయారు చేస్తామన్నారు.

Feeding Centers | హెచ్​పీవీ వ్యాక్సినేషన్​

vaccination

రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 3,200 సర్వికల్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని రాజనర్సింహ పేర్కొన్నారు. దీని నివారణకు హెచ్‌పీవీ (HPV) టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. 14 ఏళ్లు నిండిన సుమారు 4లక్షల మంది బాలికలకు ఈ టీకా వేస్తామని తెలిపారు. ఈ వ్యాక్సిన్​ను కేంద్రం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

దీనిని కూడా చదవండి : ACB raids Tahsildar | తహశీల్దార్​ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆస్తులు చూస్తే షాక్​ అవాల్సిందే?

Telangana Rain Alert | నేడు రాష్ట్రానికి వర్ష సూచన
Samsung Mobile Fraud | తక్కువ ధరకే శాంసంగ్ ఫోన్ అంటూ మోసం.. పార్శిల్ విప్పి చూశాక షాక్‌
LPG Supply Review | గ్యాస్ కొరత లేకుండా చర్యలు : సీఎస్​
Licensed Surveyors | లైసెన్స్​డ్​ సర్వేయర్లకు వేతనం ఇవ్వాలి : హరీశ్​రావు
Fake Dentist Arrest | పదో తరగతి పాస్​ కాకుండానే డాక్టర్​గా.. నకిలీ వైద్యుడి అరెస్ట్​
TAGGED:Child NutritionFeeding CentersGovernment ProgramsHealth InitiativesHPV VaccinationHyderabad MothersWomen Empowerment
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Sudharshan Reddy Dance | Sudharshan Reddy Dance | బంజారాలతో స్టెప్పులేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
Next Article Nishant Kumar JDU Nishant Kumar JDU | రాజకీయాల్లోకి బీహార్ సీఎం నితీశ్ కుమారుడు ఎంట్రీ.. జేడీయూలో చేరిన నిశాంత్ కుమార్..
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?