Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Fenugreek | చేదు మెంతుల్లో దాగున్న తీపి ప్రయోజనాలు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

లైఫ్​స్టైల్​ - Fenugreek | చేదు మెంతుల్లో దాగున్న తీపి ప్రయోజనాలు!

లైఫ్​స్టైల్​తాజా వార్తలు

Fenugreek | చేదు మెంతుల్లో దాగున్న తీపి ప్రయోజనాలు!

ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ సిద్ధమైన ఔషధాన్ని రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా మనం అనేక దీర్ఘకాలిక రోగాల నుంచి రక్షణ పొందవచ్చు. మెంతులు చేదుగా ఉన్నా అవి ఇచ్చే ఫలితాలు మాత్రం చాలా తీపిగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 7, 2026 8:56 ఉద.
Naresh chandan
14 గంటలు ago
Share
Fenugreek | చేదు మెంతుల్లో దాగున్న తీపి ప్రయోజనాలు!
Fenugreek | చేదు మెంతుల్లో దాగున్న తీపి ప్రయోజనాలు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Fenugreek | మన వంటింట్లో లభించే పోపు దినుసుల్లో మెంతులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇవి రుచికి చేదుగా అనిపించినా మన శరీరానికి చేసే మేలు మాత్రం అపారం. మెంతులు కేవలం వంటకు రుచిని ఇవ్వడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలకు అద్భుత ఔషధంగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Contents
  • Fenugreek | రక్తహీనతకు చెక్ :
    • Fenugreek | మహిళల ఆరోగ్యానికి భరోసా:
      • బాలింతలకు , శిశువులకు మేలు:
      • జుట్టు , జీర్ణ సమస్యలకు పరిష్కారం:

Fenugreek | రక్తహీనతకు చెక్ :

కేవలం మెంతులే కాకుండా మెంతి ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతి ఆకుల్లో ఐరన్ అత్యధికంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య దరిచేరదు. అంతేకాకుండా వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి.

విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచితే విటమిన్ ఏ కంటి చూపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

Fenugreek | మహిళల ఆరోగ్యానికి భరోసా:

మహిళలు ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యలకు మెంతులు చక్కని పరిష్కారం. ముఖ్యంగా నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. సుమారు మూడు నెలల పాటు మెంతులను సప్లిమెంట్‌గా తీసుకున్న వారిలో నెలసరి నొప్పి గణనీయంగా తగ్గినట్లు పరిశోధనల్లో తేలింది.

బాలింతలకు , శిశువులకు మేలు:

కొత్తగా తల్లైన వారిలో ఒత్తిడి, ఆందోళన కారణంగా పాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. అటువంటి వారు మెంతులతో చేసిన టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల శిశువులకు తగినంత పోషణ అందడమే కాకుండా వారి బరువు పెరగడానికి కూడా ఇది దోహదపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

జుట్టు , జీర్ణ సమస్యలకు పరిష్కారం:

ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. రాత్రిపూట మెంతులను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి తాగడం వల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా మారుతాయి. అలాగే గ్యాస్ అజీర్తి మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి మెంతులు ఒక వరమని చెప్పవచ్చు. మెంతులను వేడి నీటిలో పది నిమిషాల పాటు నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తక్షణమే తగ్గుతాయి.

ఇది కూడా చదవండి: Sugar cravings causes | భోజనం తర్వాత తీపి తినాలనిపిస్తోందా.. అయితే శరీరంలో ఈ లోపం ఉన్నట్లే!

Trump Warns Iran | ఇరాన్​కు డొనాల్​ ట్రంప్​ స్ట్రాంగ్​ వార్నింగ్​..
Anirudh Hyderabad Concert | నేడు హైదరాబాద్​లో అనిరుధ్​ మ్యూజిక్​ కాన్సర్ట్.. ట్రాఫిక్​ ఆంక్షలు
Maoist Surrender  | మావోయిస్ట్​ కీలక నేత లొంగుబాటు
Temple Circuit | బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్
Chanakya Success Principles | ధనవంతులుగా అవ్వాలనుకుంటున్నారా.. ఆచార్య చాణక్యుడు చెప్పిన రహస్యాలు తెలుసుకోవాల్సిందే!
TAGGED:ayurveda tipsdigestion improvementFenugreekfenugreek health benefitshair growth tipshealthy lifestylemethi seeds usesnatural remedieswomen health care
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Temple Pradakshina Secrets Temple Pradakshina Secrets | గుడిలో ప్రదక్షిణలు చేస్తున్నారా.. అయితే ఈ రహస్యం తెలుసుకోవాల్సిందే!
Next Article April 08 Pre Market Analysis April 08 Pre Market Analysis | ట్రంప్ వెనుకడుగు.. మార్కెట్ల ముందడుగు.. భారీ లాభాలతో ప్రారంభం కానున్న స్టాక్ మార్కెట్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?