అక్షరటుడే, కమ్మర్పల్లి: Financial Literacy | విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే పొదుపు చేయడం నేర్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ లిటరసీ అధికారులు విజయ్ కుమార్, కృష్ణవేణి అన్నారు. మండలంలోని కోనాపూర్‌లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Zilla Parishad High School) భూషణరావుపేట తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ మక్సూద్ అలీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు.
Financial Literacy | తల్లిదండ్రులు సైతం..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ ఆర్థిక అవసరాలపై స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణం తీసుకోకుండా బ్యాంకుల్లో రుణం తీసుకోవాలని తెలిపారు. బ్యాంకులు ప్రజల అవసరాలకు విద్యా రుణం, బంగారు ఆభరణాలపై, గృహ నిర్మాణం, పంటల కోసం రుణాలు ఇస్తాయన్నారు. గడువు తేదీ లోపల రుణం చెల్లిస్తే నిబంధనల మేరకు మరిన్ని అవకాశాలు ఇస్తారన్నారు. పొదుపు చేసిన, సంపాదించిన డబ్బును సేవింగ్స్ ఖాతా (Savings Account), రికరింగ్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో దాచుకోవచ్చని, ప్రతి విద్యార్థి బ్యాంకులో ఖాతా తీసుకొని ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించాలని వివరించారు.
Financial Literacy | సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి..
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సైబర్ నేరాలపై (Cyber Crimes) అవగాహన కలిగి ఉండాలని, తెలియని లింకుల ద్వారా వచ్చే మెసేజ్‌లను ఓపెన్ చేయవద్దని, ఆన్లైన్ మార్కెటింగ్ విధానంలో మోసపోవద్దని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో మనకు తెలిసిన వ్యక్తుల లాగా నటిస్తూ మోసం చేస్తారని, మీకు లాటరీ వచ్చిందని మోసం చేస్తారన్నారు. వ్యక్తిగత వివరాలైన డెబిట్, క్రెడిట్, ఏటీఎం కార్డు పిన్ ఎవరికి చెప్పవద్దని పాస్వర్డ్లు తరచూ మార్చుకోవాలని తెలిపారు. బ్యాంక్ ఖాతా లేని విద్యార్థులకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ భూషణరావుపేట శాఖలో ఉచితంగా జీరో బ్యాలెన్స్ ఖాతాలు అందజేశారు. విద్యార్థులందరికీ నోటుబుక్కులు, పెన్నులు అందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చౌడారపు రాంప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Dharmapuri Sanjay Protest | డి.సంజయ్‌కు పదవి ఇవ్వాలని నిరాహార దీక్ష
