Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Financial Tips for Women | ఆర్థిక స్థితిని మార్చేసే ‘గోల్డెన్’ టిప్స్.. సంపన్న మహిళలు పాటించే ఆ 5 సూత్రాలు ఇవే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

లైఫ్​స్టైల్​ - Financial Tips for Women | ఆర్థిక స్థితిని మార్చేసే ‘గోల్డెన్’ టిప్స్.. సంపన్న మహిళలు పాటించే ఆ 5 సూత్రాలు ఇవే!

లైఫ్​స్టైల్​

Financial Tips for Women | ఆర్థిక స్థితిని మార్చేసే ‘గోల్డెన్’ టిప్స్.. సంపన్న మహిళలు పాటించే ఆ 5 సూత్రాలు ఇవే!

Srinivas kolluri
Last updated: మార్చి 17, 2026 9:47 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Financial Tips for Women

అక్షరటుడే,హైదరాబాద్ : Financial Tips for Women | ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆర్థిక నిర్ణయాలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. సరైన సమయంలో తీసుకునే సరైన నిర్ణయం మనల్ని సంపన్నులుగా మారుస్తుంది.

Contents
  • Financial Tips for Women | అనవసర ఖర్చులకు కళ్లెం..
    • Financial Tips for Women | స్పష్టమైన లక్ష్యాలు..
    • Financial Tips for Women | పెట్టుబడుల విభజన..
      • Financial Tips for Women | అత్యవసర నిధి..
        • Financial Tips for Women | నిరంతర అభ్యాసం..

ముఖ్యంగా ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న మహిళలు కొన్ని ప్రత్యేకమైన అలవాట్లను, క్రమశిక్షణను పాటిస్తారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. డబ్బును కేవలం సంపాదించడమే కాకుండా, దానిని ఎలా నిర్వహించాలి, ఎలా వృద్ధి చేయాలి అనే విషయాల్లో వారు అనుసరించే సూత్రాలు మనకూ ఉపయోగపడతాయి.

Financial Tips for Women | అనవసర ఖర్చులకు కళ్లెం..

ఆర్థిక శాస్త్రం (Economics)లో ఒక ప్రాథమిక సూత్రం ఉంది, ‘అవసరం లేని వస్తువులను కొంటే, త్వరలోనే అవసరమైన వస్తువులను అమ్ముకోవాల్సి వస్తుంది’. ఈ సూత్రాన్ని డబ్బున్న మహిళలు తూచా తప్పకుండా పాటిస్తారు. ఆడంబరాల కోసం డబ్బును వృథా చేయకుండా, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పొదుపు చేస్తారు. ప్రస్తుత అవసరాలను తీర్చుకుంటూనే, భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడులకు పెద్దపీట వేస్తారు.

Financial Tips for Women | స్పష్టమైన లక్ష్యాలు..

ధనవంతులైన మహిళలకు తమ ఆర్థిక భవిష్యత్తుపై పూర్తి అవగాహన ఉంటుంది. రిటైర్మెంట్ ప్లాన్, సొంత ఇంటి కల, లేదా కొత్త వ్యాపారం ప్రారంభించడం వంటి విషయాల్లో వారు ఎంతో స్పష్టతతో ఉంటారు. తమ ఆర్థిక స్థితిగతులను, నష్ట భయాన్ని భరించే సామర్థ్యాన్ని అంచనా వేసుకున్న తర్వాతే పకడ్బందీగా అడుగులు వేస్తారు.

Financial Tips for Women | పెట్టుబడుల విభజన..

ఒకే చోట మొత్తం పెట్టుబడి పెట్టడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే సంపన్న మహిళలు తమ పెట్టుబడులను ఈక్విటీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారం , స్థిరాస్తి (Real Estate) వంటి వివిధ రంగాల్లో విభజిస్తారు. దీనివల్ల ఒక రంగంలో నష్టం వచ్చినా, మరో రంగం నుండి వచ్చే లాభాలు వారి ఆర్థిక స్థితిని కాపాడతాయి.

Financial Tips for Women

 

Financial Tips for Women | అత్యవసర నిధి..

జీవితంలో ఎప్పుడు ఎలాంటి కష్టాలు వస్తాయో ఎవరూ చెప్పలేరు. అందుకే వారు ముందస్తుగా ‘ఎమర్జెన్సీ ఫండ్’ను ఏర్పాటు చేసుకుంటారు. ఆదాయంలో కొంత భాగాన్ని సురక్షితమైన పథకాల్లో పొదుపు చేస్తూ, ఆపద కాలంలో అది అండగా ఉండేలా చూసుకుంటారు. దీనివల్ల ఎలాంటి ఆర్థిక సంక్షోభం ఎదురైనా వారు ధైర్యంగా నిలబడగలుగుతారు.

Financial Tips for Women | నిరంతర అభ్యాసం..

ఆర్థిక అంశాలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండటం వీరి ప్రధాన లక్షణం. పర్సనల్ ఫైనాన్స్ , కొత్త పెట్టుబడి మార్గాలపై అవగాహన పెంచుకుంటారు. అలాగే, తమకు అన్నీ తెలుసు అనే భ్రమలో ఉండకుండా.. అవసరమైనప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్లు (CA) లేదా ఆర్థిక సలహాదారుల సంప్రదించడానికి అస్సలు వెనకాడరు. అప్పుల విషయంలోనూ వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల వంటి వాటిని విచక్షణతో వినియోగిస్తూ, కేవలం లాభం వచ్చే ఆస్తుల కోసమే రుణాలు తీసుకుంటారు.

ఈ అలవాట్లను మన జీవితంలో భాగం చేసుకుంటే, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడమే కాకుండా సంపన్నమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు.

ఇది కూడా చదవండి..: వాయు కాలుష్యంతో పురుషుల సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం: ఇందిరా ఐవీఎఫ్ పరిశోధనలో వెల్లడి

Women Stomach Pain | మహిళల్లో కడుపు నొప్పి.. ఏ ప్రాంతంలో నొప్పి వస్తే ఏ అనారోగ్యానికి సంకేతమంటే..!
Revive Plants Tips | మొక్కలు వాడిపోతున్నాయా.. ఈ చిట్కాలతో పచ్చగా మార్చండిలా!
Piles Treatment Tips | పైల్స్ వేధిస్తున్నాయా.. ఆపరేషన్ లేకుండా తగ్గించుకోండిలా!
Paralysis Warning Signs | పక్షవాతం.. శరీరం ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ ఇవే!
వాయు కాలుష్యంతో పురుషుల సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం: ఇందిరా ఐవీఎఫ్ పరిశోధనలో వెల్లడి
TAGGED:emergency fundfinancial planningfinancial tipsinvestment strategiesmoney managementpersonal financesavings tipssmart spendingwealth buildingwomen and wealth
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Chaitra Amavasya | కొత్త అమావాస్య.. పితృదేవతల ఆశీస్సుల కోసం ఉగాదికి ఒకరోజు ముందే చేసే పండగ! Chaitra Amavasya | కొత్త అమావాస్య.. పితృదేవతల ఆశీస్సుల కోసం ఉగాదికి ఒకరోజు ముందే చేసే పండగ!
Next Article Telangana Weather Alert | రైతులకు అలెర్ట్​.. ఆ ప్రాంతాల్లో అకాల వర్షాలు! Telangana Weather Alert | రైతులకు అలెర్ట్​.. ఆ ప్రాంతాల్లో అకాల వర్షాలు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?