Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Finn Allen 33 Ball Century | ఈడెన్ గార్డెన్స్‌లో కివీస్ తుపాను ఇన్నింగ్స్.. మ‌ళ్లీ ‘ఛోకర్స్’గా సౌతాఫ్రికా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - Finn Allen 33 Ball Century | ఈడెన్ గార్డెన్స్‌లో కివీస్ తుపాను ఇన్నింగ్స్.. మ‌ళ్లీ ‘ఛోకర్స్’గా సౌతాఫ్రికా

క్రీడలు

Finn Allen 33 Ball Century | ఈడెన్ గార్డెన్స్‌లో కివీస్ తుపాను ఇన్నింగ్స్.. మ‌ళ్లీ ‘ఛోకర్స్’గా సౌతాఫ్రికా

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ జ‌ట్టు అద్భుత ప్రదర్శనతో సౌతాఫ్రికా జ‌ట్టును చిత్తు చేసింది.

Srinivas kolluri
Last updated: మార్చి 5, 2026 10:03 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Finn Allen 33 Ball Century
Finn Allen 33 Ball Century

అక్షరటుడే, వెబ్​డెస్క్: Finn Allen 33 Ball Century | కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ ప్రేక్షకులకు అసలు ఉత్కంఠ లేకుండా ముగిసింది. సెమీస్ వరకు ఓటమి లేకుండా దూసుకొచ్చిన సౌతాఫ్రికా జ‌ట్టు ఈ కీలక పోరులో చిత్తుగా ఓడిపోయింది.

Contents
  • Finn Allen 33 Ball Century | కివీస్ బౌలర్ల అదిరే ప్రదర్శన
    • Finn Allen 33 Ball Century | న్యూజిలాండ్ జట్టు ఫైనల్‌కు

మరోవైపు న్యూజిలాండ్ టీం (New Zealand Team) అసాధారణ బ్యాటింగ్‌తో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది.ముందుగా కివీస్ కెప్టెన్ సాంట్న‌ర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణయం ఫ‌లించింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఒక దశలో 5 వికెట్లకు 77 పరుగులతో కష్టాల్లో పడిన ఆఫ్రికన్ జట్టును యాన్సెన్ ఆదుకున్నాడు. అతను కేవలం 30 బంతుల్లో అజేయంగా 55 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.

Finn Allen 33 Ball Century | కివీస్ బౌలర్ల అదిరే ప్రదర్శన

ట్రిస్టన్ స్టబ్స్ (29)తో కలిసి ఆరో వికెట్‌కు 48 బంతుల్లో 73 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, కోల్ మెక్‌కాంచీ, ర‌చిన్ ర‌వీంద్ర తలా రెండు వికెట్లు తీసి సౌతాఫ్రికాను కట్టడి చేశారు.ఇక 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (Finn Allen) విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. అతను 8 సిక్స్‌లు, 10 ఫోర్ల సాయంతో కేవలం 303 స్ట్రైక్‌రేట్‌తో 100 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. మరోవైపు టిమ్ షెపర్డ్ 58 పరుగులతో చక్కటి మద్దతు ఇచ్చాడు. ర‌చిన్ ర‌వీంద్ర‌న 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Finn Allen 33 Ball Century | న్యూజిలాండ్ జట్టు ఫైనల్‌కు

న్యూజిలాండ్ జట్టు కేవలం 12.5 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయం కివీస్ శక్తిని చాటిచెప్పింది. సెమీస్ వరకు అజేయంగా సాగిన సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం పెద్ద దెబ్బగా మారింది. బ్యాటింగ్‌లో తడబాటు, బౌలింగ్‌లో దారుణ వైఫల్యం జట్టును కుంగదీసింది. ఒక్క ర‌బాడ మాత్రమే వికెట్ సాధించగలిగాడు. మిగతా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఈ భారీ విజయంతో న్యూజిలాండ్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్లో కివీస్ ఎవరిని ఎదుర్కొంటుందో చూడాలి. అయితే సౌతాఫ్రికా ఈ ఓట‌మితో మ‌రోసారి చోక‌ర్స్‌గా మారారు.

ఇది కూడా చదవండి..: T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్ 2026పై యుద్ధ ప్రభావం.. జట్ల భద్రతపై ఐసీసీ అప్రమత్తం

Saketh Myneni Deputy Collector | టెన్నిస్ స్టార్‌కి డిప్యూటీ కలెక్టర్ పదవి.. క్రికెటర్ శ్రీచరణికి నజరానా
Suryakumar Yadav Retirement | సూర్య‌కుమార్ రిటైర్ కాబోతున్నాడంటూ ప్ర‌చారాలు.. ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చిన టీ20 కెప్టెన్
India T20 Semifinal | కరేబియన్​ జట్టుపై ఘన విజయం.. సెమీ ఫైనల్​లోకి భారత్​
T20 World Cup Semifinals | టీ20 వరల్డ్ కప్ సెమీస్ సమరం.. సౌతాఫ్రికా-న్యూజిలాండ్ ఢీ, ఇంగ్లాండ్ ప్రత్యర్థి ఎవ‌రో?
Sanju Samson 97 | సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్‌పై థ్రిల్లింగ్ విజయం
TAGGED:Cricket NewsEden GardensFinn AllenNew Zealand CricketNew Zealand TeamNZ vs SASouth Africa CricketT20 World CupT20 World Cup Semifinal
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Sugar Daddy Parties | బెంగళూరులో ‘షుగర్ డాడీ–షుగర్ బేబీ’ పార్టీలు.. గ్యాంగ్‌రేప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి… Sugar Daddy Parties | బెంగళూరులో ‘షుగర్ డాడీ–షుగర్ బేబీ’ పార్టీలు.. గ్యాంగ్‌రేప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి…
Next Article Unseasonal Rains Telangana Unseasonal Rains Telangana | మళ్లీ అకాల వర్షాలు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?